Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Justice Amarnath Goud: 91,157 కేసులను పరిష్కరించిన జస్టిస్ అమర్ నాథ్ గౌడ్..

ఏవైనా పంచాయతీలు కోర్టు వరకు వెళ్తే .. అంత త్వరగా తీర్పు రాదు. కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కీలకమైన కేసులు తప్పించి.. మిగతా కేసులో తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇందుకు కారణం కూడా ఉంది. లక్షల్లో కేసులు పెండింగ్ లో ఉండడంతో తీర్పు రావడం ఆలస్యం అవుతుంది. ఇక సివిల్ కేసుల్లో చాలా సమయం పడుతుంది. అయితే ఓ జడ్జి మాత్రం అత్యధిక తీర్పులు ఇచ్చి రికార్డులకు ఎక్కారు. ఆయనే త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్ నాథ్ గౌడ్.

ఆయన జడ్జిగా అత్యధిక కేసులను పరిష్కరించారు. అంతే కాదు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డుల్లోకి ఎక్కారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా జస్టిస్ అమర్​నాథ్ గౌడ్ ​కు రాజ్ భవన్ లో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ​ను ప్రదానం చేశారు. జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ 2017 నుంచి రోజుకు సగటున 109 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. ఆయన ఇప్పటి వరకు 91,157 కేసుల్లో తీర్పు వెల్లడించారు.

Tripura High Court judge Justice Amar Nath Goud disposed of 91157 cases

జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ స్వస్థలం హైదరాబాద్. ఆయన 2017లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2021 అక్టోబర్ 28న జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. నవంబర్ 11, 2022 నుంచి ఏప్రిల్ 16, 2023 వరకు త్రిపుర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో 40 పెండింగ్ కేసులను పరిష్కరించగా.. త్రిపుర హైకోర్టులో 60 శాతం కేసుల్లో తీర్పు చెప్పారు.

జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అత్యధిక కేసులను పరిష్కరించడం పట్ల ఆయన్ను పలువురు అభినందించారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదగాలని కోరుకున్నారు. యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+