జాతీయ స్థాయిలో పాత్రపై కేసీఆర్ క్లారిటీ - ఫ్రంట్ ల కోసం కాదు : ఎన్టీఆర్ - గవర్నర్ వ్యవస్థ పైనా ..!!
టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఏం కోరుకుంటోంది...దేశం కోసం తన లక్ష్యం ఏంటనే దాని పైన టీఆర్ఎస్ అధినేత..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. కొత్త రాజకీయ శక్తి అవసరమని కేసీఆర్ తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో ఉజ్వల పాత్ర పోషిస్తామని ప్రకటించారు. ఎవరినో గద్దె దించటానికో..ఎక్కించటానికో కాదు..గద్దెను ఎక్కించాల్సింది ప్రజలని కేసీఆర్ తేల్చి చెప్పారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదు..ప్రజల జీవన స్థితిగతులని స్పష్టం చేసారు.
దేశం ఏ లక్ష్యం వైపు పయణిస్తోందో ఆలోచించాలని సూచించారు. దేశం ప్రస్తుతం లక్ష్య రహితంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. దేశానికి ఇప్పడు కావాల్సింది ఫ్రంట్ లు కావు... ప్రత్యామ్నాయ అజెండా కావాలని కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశ నిర్మాణానికి ఏది అవసరమో..ఆ దిశగా తమ కార్యాచరణ కొనసాగుతోందని వెల్లడించారు. దేశం బాగుపడటానికి తెలంగాణ నుంచే జరిగితే అది మనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు.

దేశం కోసం శక్తిమేర పని చేద్దాం
దేశ గతిని మార్చటానికి - స్థితిని మార్చటానికి..ప్రగతి పంథాలో నడిపంచటానికి తన వంతు శక్తి లేకుండా ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. పార్టీలను కలపటం.. ఎవరెవరినో కలిపి టెంట్లు ఏర్పాటు చేయటం తన లక్ష్యం కాదని స్పష్టంగా చెప్పారు. తాను కోరుకుంటున్నది ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కాదు.. ప్రత్యామ్నాయ విధానం కావాలని ప్లనరీ వేదికగా తేల్చారు.
ఎవరినో ప్రధానిని చేయటం కోసం కాదని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సాధించిన తీరును వివరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత సాధించిన విజయాలను కేసీఆర్ వివరించారు. ఈ రోజున తెలంగాణ టీఆర్ఎస్ కంచుకోట గా పేర్కొన్న సీఎం.. దీనిని ఎవరు బద్దలు కొట్టలేరని ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణకు టీఆర్ఎస్ రక్షణ కవచంగా అవిర్ణించారు.

ఫ్రంట్ ల కోసం కాదు... ప్రజల కోసం
దేశంలో విపరీతమైన..అనారోగ్య కర..అవసరం లేని పెడ ధోరణలు ప్రబలుతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు. దుర్మారమైన - సంకుచితమైన విధానాలు దేశానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయని వివరించారు. రాష్ట్రంగా-పార్టీగా మన కర్తవ్యం ఎలా ఉండాలనేద నిర్ణయిద్దామని పిలుపునిచ్చారు. దేశ అభ్యున్నతి కోసం శక్తి వంచన లేకుండా పని చేయాలని ఆకాంక్షించారు.
విద్యుత్ మెగా వాట్ల అందుబాటులో ఉన్నా..వినియోగించలేని పరిస్థితుల్లో ఉన్నారని వివరించారు. గుజరాత్ లో భరించలేని విద్యుత్ కోతలు ఉన్నాయని..మన సరిహద్దు రాష్ట్రాల్లోనూ కోతలు అమలు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. మధ్యలో మణిదీపంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఇదే దేశంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. దేశంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమేనని కేసీఆర్ వెల్లడించారు.
ప్రత్యామ్నాయ అజెండా దిశగా
ఇవే అంశాలను తాను అందరు సీఎంల సమక్షంలో నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని వద్ద ప్రస్తావించానని చెప్పారు. దేశంలో ప్రజల కోసం ఉజ్వల - ఉద్విగ్న పాత్ర పోషిస్తామని వెల్లడించారు. అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్ అని చెబుతూ.. 13 కోట్ల మంది భారతీయులు ప్రపంచ దేశాల్లో తమ శక్తిని వినియోగిస్తున్నారని వివరించారు.
ఇంత పటిష్టమైన దేశంలో ఎందుకీ దౌర్బాగ్య పరిస్థితులు ఉన్నాయని ప్రశ్నించారు. అన్నీ ఉన్నా..మన పాలకులకు బుర్ర లేదని వ్యాఖ్యానించారు. మైకులు పగిలిపోయే ఉపాన్యాసాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ పాలనే దేశానికి రోల్ మోడల్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ అజెండా దిశగా ప్రయత్నం జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

మత విద్వేషాలపైన కేసీఆర్ ఆందోళన
మత విద్వేషాలు దేశంలో మంచి వా అని ఆలోచించాలని సూచించారు. బెంగుళూరు లో 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించాలని సూచించారు. విదేశాల్లో ఉన్న 13 కోట్ల మందిని అక్కడి వారు వెనక్కు పంపిస్తే..కేంద్రం వారికి ఉద్యోగాలు ఇవ్వగలదా అని ప్రశ్నించారు. కువైట్ లో భారత్ లోని పరిస్థితుల పైన చర్చ మొదలైందని చెప్పారు.
పుల్వామా..కాశ్మీర్ ఫైల్స్..సర్జికల్ స్ట్రైక్స్ అంటూ మానిన గాయాలను రేపటం ఏంటంటూ ప్రశ్నించారు. దేశ రాజధానిలో దేవుడి పేరుతో కత్తులు పట్టుకొని ఊరేగింపులేనా కోరుకుంటోందంటూ దుయ్యబట్టారు.

గవర్నర్ల వ్యవస్థ - ఎన్టీఆర్ పైనా..
ఎన్టీఆర్ మంచి మనసుతో పార్టీ పెట్టారని కేసీఆర్ గుర్తు చేసారు. దుర్మార్గమైన గవర్నర్లను వినియోగించి..ఆయన ప్రభుత్వం తొలిగించారని గుర్తు చేసారు. ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు కేంద్రం మెడలు వంచి తిరిగి ఎన్టీఆర్ ను సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టారని చెప్పారు.
ఆ గవర్నర్ అవమాన కరంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయారంటూ..ప్రస్తుతం మహారాష్ట్ర - తమిళనాడు లో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను కేసీఆర్ ప్రస్తావించారు. కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేసారు. ఈ దుర్మార్గాలను తరిమి కొట్టేందుకు కొత్త తరహా రాజకీయం మొదలవుతుందని కేసీఆర్ ప్రకటించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications