Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దద్దరిల్లుతున్న ధర్నా చౌక్.!గులాబీ మయమవుతున్న ఇందిరా పార్క్.!

హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర బిజెపి సర్కార్ వైఖరిని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో కొనసాగనున్న గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు చేసే విధాంగా కార్యాచరచరణ రూపొందించారు గులాబీ నేతలు. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేసారు ముఖ్య నేతలు. మూడు లక్షల మంది గులాబీ సైన్యం రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించారు గులాబీ అగ్రనేతలు.

వంద నియోజక వర్గాల్లో నిరసనలు.. కేంద్రం దిగిరావాలంటున్న టీఆర్ఎస్ నేతలు..

వంద నియోజక వర్గాల్లో నిరసనలు.. కేంద్రం దిగిరావాలంటున్న టీఆర్ఎస్ నేతలు..

ఇదిలా ఉండగా నిన్న బిజెపి నేడు టీఆర్ఎస్ వరుసగా పోటాపోటీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టిఆర్ఎస్ నేతల ఉమ్మడి ధర్నా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. సిరిసిల్లలో నిర్వహించబోయే ధర్నా కార్యక్రమంలో స్వయంగా తారకరామారావు పాల్గొంటారు. ఇటు సిద్ధిపేటలో హరీష్ రావు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు వరి దాన్యం కొనుగోలు అంశంలో బీజేపి అనుసరిస్తున్న ద్వంధ్వ విదానాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాలకు గులాబీ నేతలు రూపకల్పన చేసారు.

రైతుల్లో గందరగోళం.. బీజేపి కారణమన్న గులాబీ నేతలు..

రైతుల్లో గందరగోళం.. బీజేపి కారణమన్న గులాబీ నేతలు..

అంతే కాకుండా ఆయా జిల్లా ప్రధాన కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, నాయకులు రైతుల ధర్నాలో పాల్గొంటారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి ధర్నాలకు అనుమతి తీసుకున్నారు టిఆర్ఎస్ నేతలు. పంజాబ్ లో పూర్తి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో పండిస్తున్న పంటను ఎందుకు కొనుగోలు చేయడం లేదని గులాబీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు పై కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేస్తన్నారు గులాబీ నేతలు.

నిరసనల పట్ల తెలంగాణలో భిన్నాబిప్రాయాలు.. మాక్కూడా అనుమతులివ్వాలంటున్న విపక్షాలు

నిరసనల పట్ల తెలంగాణలో భిన్నాబిప్రాయాలు.. మాక్కూడా అనుమతులివ్వాలంటున్న విపక్షాలు

కాగా గులాబీ పార్టీలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల పట్ల విపక్షాల నుండి భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి తెలంగాణ నేతలకు నిరసనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చిన పోలీసులు ఇతర నేతల నిరసన కార్యమక్రమాలకు అనుమతులను ఎందుకు నిరాకరిస్తున్నారని జనసమితి అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఎన్నికల కోడ్ లేనప్పుడు నిరసర కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటే అనుమతులు ఇవ్వకపోగా అర్ధరాత్రి అరెస్టులు చేసారని కోదండరాం గుర్తు చేసారు. అర్టికిల్ 15 ప్రకారం ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, టీఆర్ఎస్ నేతలకు ఇచ్చినట్టే ఇతర పార్టీ నేతలకు కూడా అనుమతులు ఇవ్వాలని కోదండరాం కోరారు.

ధర్నాచౌక్ కోసం పోరాడింది నేనే.. నిరసనలు తెలిపే హక్కు టీఆర్ఎస్ కు లేదన్న వీహెచ్

ధర్నాచౌక్ కోసం పోరాడింది నేనే.. నిరసనలు తెలిపే హక్కు టీఆర్ఎస్ కు లేదన్న వీహెచ్

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు తెలిపే ఆవశ్యకత ఉండదని, ధర్నా చౌక్ ను నిషేదించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అదే ధర్నాచౌక్ ను నిరసనలు తెలిపేందుకు వేదిక చేసుకోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రభుత్వం నిషేదిస్తే ధర్నాచౌక్ ఉండాలని న్యాయస్థానంలో పోరాడి ధర్నాచౌక్ ను సాధించగలిగానని వీహెచ్ గుర్తు చేసారు. అవసరం లేదనుకున్న ధర్నాచౌక్ లో గులాబీ నేతలకు నిరసనలు చేసే నైతిక హక్కు లేదని వి.హనుమంత రావు మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+