మునుగోడులో నేడే నామినేషన్లు -ఓటర్లకు విమాన టిక్కెట్లు..!!

మునుగోడు ఉప ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావటంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా.. కీలకమైన నామినేషన్ల దాఖలుకు రంగం సిద్దమైంది. ఈ రోజు అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఈ నెల 13న నామినేషన్ వేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య నామపత్రాలు దాఖలు చేయనున్నారు. సీపీఎం, సీపీఐ ముఖ్యనాయకులతో కలిసి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.

నేడు టీఆర్ఎస్ -బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లు

నేడు టీఆర్ఎస్ -బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లు

నామినేషన్ కార్యక్రమానికి ఎటువంటి హంగామా లేకుండా పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే మునుగోడులో వామపక్ష పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. ఇక, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ నుంచి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజే నామినేషన్ వేయనున్నారు. మునుగోడు నుంచి చండూరు వరకు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌తో పాటూ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్, ఈటల రాజేందర్‌, కేంద్రమంత్రులు కిషన్​రెడ్డి, భుపేంద్ర యాదవ్​, లక్ష్మణ్​, డీకే. అరుణ హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం పార్టీ ముఖ్య నేతలు నియోజకవర్గంలోనే మొహరించారు.

అమితి షా డైరెక్షన్ లో బీజేపీ నేతలు

అమితి షా డైరెక్షన్ లో బీజేపీ నేతలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వీయ పర్యవేక్షణలో పార్టీ ముఖ్యనేతలు మునుగోడులో పని చేస్తున్నారు. ఈ నెలాఖరులో మరో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రతీ గడపకు వెళ్లి.. ఓటర్లను కలిసేందుకు పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఇటు మునుగోడు ఉప ఎన్నిక..అటు రాహుల్ భారత్ జోడో యాత్ర..రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక, ఎన్నిక సమీపిస్తున్న వేళ..మునుగోడులో ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటం లేదు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఎన్నిక వేళ..మునుగోడుకు రప్పించేందుకు విమాన టిక్కెట్లను బుక్ చేస్తున్నారు.

స్థానిక నేతలు - ఓటర్లకు సకల ఏర్పాట్లు

స్థానిక నేతలు - ఓటర్లకు సకల ఏర్పాట్లు

స్థానికంగా ఉండే చోటా నేతలకు డిమాండ్ పెరిగింది. ఉదయం ఒక పార్టీలో..సాయంత్రానికి మరో పార్టీలో కనిపిస్తున్నారు. పార్టీ ప్రచారం కోసం వస్తున్న వారికి వసతి కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ ఎన్నిక రాజకీయంగా పార్టీలకు..వ్యక్తిగతంగా అభ్యర్ధులకు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో ఉప ఎన్నిక వేళ భారీ ఖర్చుకు వెనుకాడటం లేదు. ఖర్చు పరంగా రెండు పార్టీలు ముందు వరసలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక, ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లకు సమయం ఉంది. మూడు ప్రధాన పార్టీలతో పాటుగా స్వతంత్రులు బరిలో నిలవనున్నారు. ఎవరికి వారు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల మాత్రం టెన్షన్ తప్పటం లేదు. దీంతో..మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నిక కోసం నేతలు సిద్దమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+