సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ: 1నే దేశరాజధానికి కేసీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకోనున్నారు.
కాగా, చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కార్యాలయం నిర్మాణంతో పాటు మూడు రోజులు ఢిల్లీలోనే ఆయన పర్యటన కొనసాగనుంది. కృష్ణానది జలాల పంపిణీపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనే ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేగాక, రాష్ట్రంలో పెండింగ్‌లో పలు సమస్యలపై కూడా కేంద్రమంత్రులతో చర్చించనున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ భేటీ ఉంటుందా? అనేది తెలియరాలేదు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ పర్యటించనున్నారు. సెప్టెంబరు 1న బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం కానున్నారు. సెప్టెంబరు 2న దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ చేస్తారు.

ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలనే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం కేంద్రం 1,300 గజాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించింది. ఈ స్థలంలోనే సెప్టెంబరు 2న మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా పాల్గొంటారు. తిరిగి సెప్టెంబరు 3న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు పలు శాఖలకు సారధ్యం వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శిగా నియమించింది. ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. బదిలీలు జరిగిన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..
Recommended Video
టీఎస్ పీఎస్సీ కార్యదర్శి: అనితా రామచంద్రన్
వ్యవసాయశాఖ కార్యదర్శి: రఘునందన్ రావు
యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్: వీ వెంకటేశ్వర్లు
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్: శరత్
పరిశ్రమల శాఖ సంచాలకులు: కృష్ణ భాస్కర్
మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి: అబ్దుల్ అజీం
వికారాబాద్ జిల్లా కలెక్టర్ : నిఖిల
వరంగల్ జిల్లా కలెక్టర్: బీ గోపి
రాజన్న సిరిసిల్ల కలెక్టర్: అనురాగ్ జయంతి
నాగర్ కర్నూల్ కలెక్టర్: పీ ఉదయ్ కుమార్
జోగులాంబ గద్వాల్ కలెక్టర్: వల్లూరు క్రాంతి
కామారెడ్డి కలెక్టర్: జితేశ్ వీ పాటిల్
మహబూబాబాద్ కలెక్టర్: కే శశాంక
జనగామ కలెక్టర్: జీహెచ్ శివలింగయ్య












Click it and Unblock the Notifications