అమిత్ షానే మమ్మల్ని వద్దన్నారు, రాహుల్ గాంధీ పెద్ద బఫూన్: కేసీఆర్

Recommended Video

    KCR Press Meet కేసీఆర్ ప్రెస్ మీట్

    హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో యాంటీ మోడీ ఉంటుందా, యాంటీ కాంగ్రెస్ ఉంటుందా ఇప్పుడే చెప్పలేమని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు.

    చట్టంలో ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది లేదని, ఈ కాలంలో తన లిమిట్స్ తనకు తెలుసునని చెప్పారు. వీవీపాట్ యంత్రాలు వచ్చాక కూడా ఈవీఎంలపై అనుమానాలు అనవసరమన్నారు. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదన్నారు.

    సర్వేలో మాకు ఇలా ఉంది

    సర్వేలో మాకు ఇలా ఉంది

    తమకు వచ్చిన సర్వే ప్రకారం ప్రతిపక్షాలు తమ దరిదాపుల్లో కూడా లేరని కేసీఆర్ చెప్పారు. 82 నియోజకవర్గాలలో తాము 60 శాతానికి పైగా పైబడి ఉన్నామని, 100 నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా ఉన్నామని చెప్పారు. ఏడు నియోజకవర్గాలు ఎవరికి పోతాయా తెలుసునని అన్నారు. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

    అమిత్ షానే మమ్మల్ని వద్దన్నారు, మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీ

    అమిత్ షానే మమ్మల్ని వద్దన్నారు, మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీ

    నరేంద్ర మోడీ ప్రధాని కాబట్టి సంబంధాలు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. కానీ తాము బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని చెప్పారు. కానీ కొందరు తాను బీజేపీతో కలుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రగతి నివేదన సభలో తాను తాయిలాలు ప్రకటిస్తానని చెప్పారని, అది సరికాదన్నారు. గోత్రాలు కలవవని, బీజేపీతో కలిసేది లేదన్నారు. మజ్లిస్ మాత్రం ఫ్రెండ్లీ పార్టీ అన్నారు. కేంద్రంలో ఓ పార్టీ ఉన్నప్పటికీ అంశాల వారిగా మద్దతిస్తామని చెప్పారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో నితీష్ తనను అడిగారని, కానీ తమను అడగని వారికి ఎలా మద్దతిస్తామన్నారు. టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హైదరాబాదుకు వచ్చినప్పుడు మాట్లాడుతూ.. మజ్లిస్‌తో కలిసి ఉండే పార్టీ తమకు వద్దని చెప్పారని గుర్తు చేశారు.

    రాహుల్ గాంధీ పెద్ద బఫూన్

    రాహుల్ గాంధీ పెద్ద బఫూన్

    రాహుల్ గాంధీ భారత దేశంలోనే అతిపెద్ద బఫూన్ అని కేసీఆర్ అన్నారు. ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీని కౌగిలించుకున్నారని చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వారసత్వ నేత అన్నారు. తాము ఢిల్లీకి గులాం కాదల్చుకోలేదని చెప్పారు. 2014కు ముందు తెలంగాణలో బాంబు పేలుళ్లు, మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని చెప్పారు. మజ్లిస్, తాము ఫ్రెండ్లీ పార్టీ అని, తాము కలిసి పని చేస్తున్నామని తెలిపారు. కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసిన సమయంలో అసదుద్దీన్ తమకు అండగా నిలబడ్డారని చెప్పారు.

     కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అయినా 20 సీట్లు గెలుచుకుంటుందా?

    కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అయినా 20 సీట్లు గెలుచుకుంటుందా?

    కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా 20 లోకసభ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పగలదా అని కేసీఆర్ ప్రశ్నించారు. వారికి ఏదో భ్రాంతి అన్నారు. వారి అభ్యర్థి చనిపోయినచోట కూడా గెలవలేదన్నారు. పాలేరు సహా పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు మృతి చెందితే, అక్కడి ఉప ఎన్నికల్లో మేం గెలిచామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లోను తెరాసను గెలిపించుకొని, అందరూ చల్లగా బతకాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+