పాత కక్షలే: మద్యం మత్తులో దారుణం.. వీడిన టీఆర్ఎస్ నేత హత్య మిస్టరీ
సనత్ నగర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దుండగులు వల్లభనేని శ్రీనివాస్ ను బండరాళ్లతో కొట్టి చంపారు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
హైదరాబాద్: ఈ నెల 16న సనత్ నగర్ బస్టాండు వద్ద హత్యకు గురైన టీఆర్ఎస్ నేత వల్లభనేని శ్రీనివాస్ హత్య మిస్టరీ వీడింది. వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు.
సనత్ నగర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దుండగులు వల్లభనేని శ్రీనివాస్ ను బండరాళ్లతో కొట్టి చంపారు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నిందితుడు షాజిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

పాత కక్షల నేపథ్యంలోనే వల్లభనేని శ్రీనివాస్ హత్య జరిగినట్టు పోలీసులు నిర్దారించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications