షాక్ మీద షాక్!: టిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌కు రెండేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పటాన్‌చెరు అధికార టీఆర్ఎస్ శాసన సభ్యుడు మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జైలు శిక్షను విధించింది. పటాన్‌చెరు పరిధి పాశ మైలారంలోని ఓ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చనిపోయాడు.
బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ యాజమాన్యంపై ఎమ్మెల్యే దాడి చేశారని కేసు నమోదైంది. దీనిని విచారించిన మెజిస్ట్రేట్... మహిపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. అతనికి రూ.2500 జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కెసిఆర్, కెటిఆర్‌లకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: సీతక్క
ములుగు కేంద్రాన్ని జిల్లాగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాలని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే సీతక్క గురువారం అన్నారు. ఆమె తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు.
ములుగు కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ములుగును జిల్లా చేస్తే ఆదివాసీ గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే గిరిజనుల అభివృద్ధిని కోరుకుంటే ములుగు కేంద్రంగా జిల్లాను ప్రకటించాలన్నారు.












Click it and Unblock the Notifications