పరీక్ష రాసిన ఎమ్మెల్యే, చేతులు కలిపిన విద్యార్ధులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం నల్గొండ జిల్లాలోని డిగ్రీ పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్షలు జరుగుతున్న తీరుని పరిశీలించేందుకు కాదు, ఓ స్టూడెంట్‌గా పరీక్షలు రాసేందుకు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నల్గొండ జిల్లా నకిరేకల్ శాసనసభ్యుడిగా వేమూరి వీరేశం టీఆర్ఎస్ పార్టీ తరుపున విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అంతకముందే ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో రెండేళ్ల విద్యా కోర్సును పూర్తి చేశారు. దీంతో తాజాగా మూడో సంవత్సరం పరీక్షలు రాసేందుకు జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాలలో ఏర్పాటైన పరీక్షా కేంద్రానికి పరీక్షలు రాసేందుకు వచ్చారు.

స్టూడెంట్స్‌తో కలిసి నేరుగా పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన వేమూరి వీరేశం, మిగతా విద్యార్ధులతో కలిసి పరీక్ష రాశారు. ఎమ్మెల్యేగా ఉన్న వీరేశం స్టూడెంట్‌గా పరీక్ష రాస్తున్న విషయం తెలుసుకున్న అక్కడి విద్యార్ధులు ఆయనతో మాటలు కలిపారు.












Click it and Unblock the Notifications