ఈడీ నోటీసుల భయంతోనే ఢిల్లీ కేసీఆర్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ఎంపీ అరవింద్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మీడియాతో మాట్లాడారు.
ఈడీ నోటీసుల భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు పెట్టారన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, బీజేపీలోకి ఎవరు వచ్చిన చేర్చుకుంటామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ర్టంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ ఎంపీ అరవింద్ వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి సైతం పోటీ చేస్తానని ధర్మపురి అరవింద్ చెప్పారు. రాష్ర్టంలో అరాచక పాలనకు టీఆర్‌ఎస్ తెరతీసిందన్నారు. రైతులపై కేసీఆర్ వైఖరిని ఎండగడతామని అరవింద్ పేర్కొన్నారు. బీజేపీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని పార్టీలో కష్టపడిన వారికి తప్పక ఫలితముంటుందని అరవింద్ అన్నారు.
పార్టీలో చేరి పనిచేయని నేతలను సహించేది లేదని హెచ్చరించారు. తన ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రాన టికెట్ గ్యారంటీ ఏంలేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తా. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ధర్మపురి అరవింద్ తెలిపారు.
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పొత్తుకు అవకాశం ఉంది. అందుకే టీఆర్ఎస్‌పై దూకుడుగా ఉన్నాం. ఈడీ నోటీసుల భయంతోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం విదేశాలకు పరారుకావడం ఖాయం. డీఎస్ ఏ పార్టీలో చేరాలన్నది ఆయన ఇష్టం అని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.
Recommended Video
ఇది ఇలావుండగా, మెదక్ జిల్లాలోని హావేలి ఘనపూర్ మండలం బోగడభూపతిపూర్ లో ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తోపాటు పలువురు బీజేపీ నేతలు శనివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతు రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయంగా రూ. 50వేలు అందజేసినట్లు చెప్పారు. వరి వేయొద్దని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బియ్యం తీసుకోవడానికి కేంద్రం సిద్దంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. వానాకాలం ధాన్యం మొత్తం వెంటనే సేకరించాలన్నారు. కేసీఆర్ ఎన్నికల ముందు హామీలు ఇస్తారని.. ఆ తర్వాత మర్చిపోతారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications