హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇల్లు ఖాళీ చేయమన్నందుకు ఎన్నారై మహిళను చెప్పుతో కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

ఓ మహిళా ఎన్నారైపై అధికార పార్టీ ఎమ్మెల్సీ ఫరూక్ చేయి చేసుకున్నాడు. ఇల్లు ఖాళీ చేయమని అడిగినందుకు ఆమెను చెప్పుతో కొట్టాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ మహిళా ఎన్నారైపై అధికార పార్టీ ఎమ్మెల్సీ ఫరూక్ చేయి చేసుకున్నాడు. ఇల్లు ఖాళీ చేయమని అడిగినందుకు ఆమెను చెప్పుతో కొట్టాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది.

చదవండి: అలా వెళ్లాను అంతే: 'బాబు వద్దకు రాయబారం వెళ్లి చిక్కిన మంత్రి'పై తలసాని ఇలా..

దీంతో ఆమె నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను చెప్పుతో కొట్టాడని, బూతులు తిట్టాడని ఆమె వాపోయారు. బాధిత మహిళ విదేశాల్లో ఉంటున్నారు.

ఎమ్మెల్సీ ఫరూక్ ఉంటున్న ఇల్లు తనది అని ఆమె చెబుతున్నారు. యాజమాన్య హక్కులు తనవే అంటున్నారు. రెండేళ్లుగా ఇల్లు ఖాళీ చేయమని చెబుతున్నప్పటికీ ఫరూక్ ఖాళీ చేయడం లేదు.

దీంతో బాధిత మహిళ.. ఎమ్మెల్సీ హుస్సేన్‌తో ఇంటిని ఖాళీ చేయించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఓ హోటల్లో ఉంటూ ప్రతి రోజు ఆయన వద్దకు వెళ్లి ప్రాదేయపడుతున్నారు. కానీ ఆయన ససేమీరా అంటున్నారు.

TRS MLC Farooq slaps NRI woman in Hyderabad

సోమవారం ఉదయం కూడా ఆమె ఎమ్మెల్సీ ఉంటున్న ఇంటికి వెళ్లింది. తన ఇల్లును ఖాళీ చేయాలని, రెండేళ్లుగా ప్రాదేయపడుతున్నానని చెప్పింది. రాజకీయ నేతగా పలుకుబడి ఉన్న మీరు ఇలా చేయడం తగదని చెప్పారు. కానీ ఆయన మాత్రం ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవాలని ఆయన హెచ్చరించారు.

ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. యాజమాన్య హక్కులు తనవే అని బాధిత మహిళ చెప్పారు. అయినప్పటికీ ఆయన ఖాళీ చేయడం లేదు. వాగ్వాదం ఎక్కువ కావడంతో అతను ఆమెను చెప్పుతో కొట్టాడు. దీంతో ఆమె నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళను చెప్పుతో కొట్టినందుకు పోలీసులు కేసు నమోదు చేసుకోనున్నారు. మరోవైపు ఇంటి యాజమాన్య హక్కులు ఎవరి పైన ఉన్నాయని పోలీసులు విచారిస్తున్నారు.

English summary
TRS MLC Farooq Hussain slapped NRI woman with chappal on Monday morning in Hyderabad over house vacate issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X