వెళ్లిపో అంటూ.. కూచిభొట్ల హత్య: అమెరికాపై తెరాస ఎంపీ నిప్పులు
అమెరికాలో జాత్యాహంకారం పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కన్సాస్‌లో శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యాహంకారి దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: అమెరికాలో జాత్యాహంకారం పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కన్సాస్‌లో శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యాహంకారి దారుణంగా హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం లోకసభలో తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. మీ దేశానికి పో అంటూ శ్రీనివాస్‌ను నిందితుడు ప్యూరింటన్ హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి సంఘటనలు చూడలేదన్నారు.

అమెరికాలో భారతీయులపై దాడుల పట్ల చింతిస్తున్నామని, భారతీయుల భద్రతపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారతీయుల మీద జరుగుతున్న దాడులపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ స్పందించారు.












Click it and Unblock the Notifications