మాకు సమస్యలున్నాయి, టెన్నిస్‌ కోర్టులా సభ: జితేందర్ రెడ్డి

న్యూఢిల్లీ: గత 22 రోజుల నుంచి లోక్‌సభలో ఏం జరుగుతుందో తనకు అర్ధం కావడం లేదని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. లలిత్ మోడీ అంశంపై లోక్‌సభలో నిర్వహించిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని, ఆ సమస్యలపై సభలో ఎప్పుడు ప్రస్తావిస్తారని తమ సీఎం కేసీఆర్ అడుగుతారని జితేందర్ రెడ్డి తెలిపారు.

బేగంపేట విమానాశ్రయం, హైకోర్టు విభజన, నీటి వివాదాలు లాంటి సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. వాటిని సభలో పరిష్కరించుకుందామని అనుంటే ఇక్కడ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే టేబుల్ టెన్నిస్ ఆట చూసినట్లు ఉందని తెలిపారు.

trs mp jithender reddy response on lalitgate in lok sabha

లలిత్ గేట్‌ విషయానికి వస్తే సుష్మాస్వరాజ్ అంటే తమకెంతో గౌరవం ఉందన్నారు. సుష్మా స్వరాజ్ తప్పు చేసిందని తాము భావించడం లేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+