పవన్ కళ్యాణ్‌కు పోటీ చేసే హక్కు, కేసీఆర్‌దే గెలుపు, కేబినెట్లో మహిళలకు కోసం అడుగుతా: కవిత

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పార్టీ పెడితే స్వాగతిస్తామని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం అన్నారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మంత్రి హరీష్ రావు ఎంపీగా పోటీ చేస్తారనే అంశంపై తాను స్పందించనని చెప్పారు.

తెరాసలోకి వచ్చేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఈసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే మహిళలకు అవకాశం ఇవ్వాలని తాను ముఖ్యమంత్రిని అడుగుతానని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఆయన భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. విభజన సమస్యలను కేంద్రం పరిష్కరించాలన్నారు.

TRS MP Kavitha says KCR will win in next elections

తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా పోటీ చేయాలా అనే విషయం పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. విపక్షాలన్నీ ఒక్కటయితే తమకే మంచిదని కవిత అన్నారు. అప్పుడు వార్ వన్ సైడ్ అవుతుందన్నారు. కేసీఆర్ గెలుపు ఖాయమన్నారు.అన్ని సర్వేలు కూడా వంద శాతం కేసీఆర్ గెలుస్తాడని చెబుతున్నాయని చెప్పారు. ఎవరు తప్పు చేసినా తెరాస ఊరుకోదన్నారు. తమకు కేంద్రంతో గొడవ కుంటే నియోజకవర్గాల పెంపు అంశం ముఖ్యమని చెప్పారు. మంత్రి కేటీఆర్‌కు దావోస్‌కు ఆహ్వానం ఉందని ఒకవేళ లేకున్నా వెళ్తే తప్పు లేదన్నారు. కేసీఆర్ వారసులు ఎవరో భవిష్యత్తు తేలుస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+