వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీల బృందం కలిసింది.

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృందం రెండు రాష్ర్టాల మధ్యగల ఉమ్మడి సంస్థల విషయంలో విభజన చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన రాజ్‌నాథ్‌సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అందుకోసం చట్టం అమలుతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తానని టీఆర్‌ఎస్ ఎంపీల బృందానికి ఆయన చెప్పారు. సుమారు అరగంట సేపు జరిగిన ఈ భేటీలో విద్యుత్, నీరు తదితర 15 ప్రధాన అంశాలపై వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి ఇబ్బందులను టీఆర్‌ఎస్ ఎంపీల బృందం ఆయనకు వివరించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపామని రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత జితేందర్‌రెడ్డి మీడియాకు చెప్పారు. తమ విజ్ఞప్తులను విన్న కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు శ్రీశైలంలో తాము జలవిద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేస్తున్నదని హోంమంత్రి దృష్టికి తెచ్చామని జితేందర్‌రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసిందని రాజ్‌నాథ్‌కు తెలిపామన్నారు.

 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

ఏపీ ప్రభుత్వం రాయలసీమ వాటా 34 టీఎంసీలైనా 76 టీఎంసీలు వాడుకుని మరీ తెలంగాణను విద్యుత్ ఉత్పత్తి చేయకుండా రాద్ధాంతం చేస్తున్నదని, పైగా ఏపీలోని విద్యుత్ ప్రాజెక్టుల నుంచి చట్టప్రకారం రావాల్సిన వాటా ఇవ్వడం లేదని చెప్పామన్నారు.

 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

కృష్ణపట్నం ప్లాంట్‌లో తెలంగాణకు వాటా లేదని వాదిస్తున్నదని కేంద్రమంత్రికి వివరించామని జితేందర్ రెడ్డి చెప్పారు. హిందూజా ప్లాంట్ నుంచి విద్యుత్ పంపిణీ చేయవద్దని ఆ సంస్థ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నదని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించామన్నారు.

 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సొసైటీలోని ఉమ్మడి నిధుల నుంచి సుమారు రూ. 420 కోట్లు, హైదరాబాద్‌లోని రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి సుమారు రూ. 21 కోట్లను మళ్ళించడం ద్వారా ఏపీ ప్రభుత్వం తెలంగాణను ఇబ్బంది పెడుతున్నదని వివరించామని చెప్పారు.

 కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌తో టీఆర్ఎస్ ఎంపీల బృందం

హైదరాబాద్ నగరంలోని ఉమ్మడి హైకోర్టును విభజించి అవశేష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని ప్రధానికి, న్యాయశాఖ మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి అన్నిచోట్లా సానుకూల స్పందనే వచ్చిందన్నారు. ప్రధాని, న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి క్లియరెన్స్ వచ్చిన ఈ అంశం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్‌లో ఉన్నదని వివరించినట్లు చెప్పారు.

English summary
All the TRS MPs will meet the Union Home Minister, Rajnath Singh, on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X