రేవంత్‌కు షాక్: టిడిపికి 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు, కెసిఆర్ వెల్‌కమ్ వ్యూహమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకొంటున్నాయి. 2019 ఎన్నికల్లో విజయం కోసం టిఆర్ఎస్ ఇప్పటి నుండే వ్యూహలను రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపితో టిఆర్ఎస్ పొత్తు ప్రతిపాదన తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో మార్పులకు నాంది పలుకుతోంది. టిడిపికి 12 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది.

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈ పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు రేవంత్‌ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనున్నారనే ప్రచారం సాగుతోంది.

బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!

2019 ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే అప్పుడే రాష్ట్రంలో పొత్తుల ప్రతిపాదనపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి.అనుహ్యంగా టిడిపితో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన ముందుకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది.

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

టిఆర్ఎస్, టిడిపి పొత్తు ప్రతిపాదన కారణంగానే రెండు పార్టీలకు ప్రయోజనంగా ఉంటుందని టిడిపిలోని కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అయితే పొత్తు ప్రతిపాదనను రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రేవంత్‌కు షాక్: 'షోకాజ్‌ ఇవ్వాల్సిందే', 'ఆ ప్రకటనలో స్పష్టత లేదు', లిస్టు రెఢీ

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రేవంత్ ప్రతిపాదిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తును కొందరు టిడిపి సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే పొత్తుల విషయంలో తెలంగాణ టిడిపిలో గందరగోళ వాతావరణం చోటుచేసుకొంది.

టిఆర్ఎస్‌తో పొత్తుంటే 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు

టిఆర్ఎస్‌తో పొత్తుంటే 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల టిడిపికి 12 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టిఆర్ఎస్ నాయకత్వం సానుకూలంా ఉందని సమాచారం. టిడిపితో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా టిఆర్ఎస్‌కు కూడ కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పొత్తులు రెండు పార్టీలకు రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటున్నారు. 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకొంటే 12 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను ఇచ్చేందుకు టిఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా ఉందని సమాచారం. అయితే టిడిపి నాయకత్వం కనీసం 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని అడుగుతున్నారని సమాచారం.

రేవంత్‌కు పొమ్మనలేక పొగ

రేవంత్‌కు పొమ్మనలేక పొగ

టిఆర్ఎస్‌తో పొత్తును టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యతిరేకిస్తారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే నేతగా రేవంత్‌రెడ్డికి గుర్తింపు లబించింది. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్న చందంగా టిడిపితో పొత్తు ప్రతిపాదన కారణంగా టిడిపి నుండి రేవంత్ దూరమౌతారు. అదే సమయంలో రాజకీయంగా తమ పార్టీకి ప్రయోజనం ఉంటుందని టిఆర్ఎస్ నాయకత్వం భావించి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అయితే టిఆర్ఎస్‌తో పొత్తు ప్రతిపాదన తెరమీదికి రావడంతోనే రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేశారని సమాచారం.

టిడిపి పొత్తు వెనుక కెసిఆర్ వ్యూహమిదే

టిడిపి పొత్తు వెనుక కెసిఆర్ వ్యూహమిదే

టిడిపితో పొత్తు పెట్టుకోవాలని కెసిఆర్ వ్యూహం వెనుక పెద్ద ప్లాన్ ఉంది. తెలంగాణలోని చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆంద్ర ప్రాంతం నుండి సెటిలైన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. జిహెచ్‌ఎంసితో పాటు రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ నియోజకవర్గాల్లో ఆంద్ర ప్రాంతం నుండి సెటిలైన ఓటర్లు ఉంటారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. అదే సమయంలో టిడిపితో పొత్తు పెట్టుకొంటే ప్రయోజనం కలుగుతోందని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

తెలంగాణలో టిడిపి ఉనికి నిలుపుకోనేందుకు

తెలంగాణలో టిడిపి ఉనికి నిలుపుకోనేందుకు

తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంటుంది. రాజకీయంగా బాగా పలుకుడిన సామాజికవర్గం కూడ. అయితే రానున్న ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గాన్ని తట్టుకొని నిలబడాలంటే కమ్మ సామాజికవర్గాన్ని కలుపుకుపోవాలని కెసిఆర్ భావిస్తున్నారు. గతంలో జలగం వెంగళరావు ఇదే ఫార్మూలాను అనుసరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతం కెసిఆర్ ఇదే పార్మూలాను అనుసరించేందుకు వ్యూహన్ని రచిస్తున్నారు. ఇందులో భాగంగానే టిడిపితో పొత్తును కోరుకొంటున్నారని సమాచారం. టిడిపితో పొత్తు ప్రతిపాదనకు కెసిఆర్ వ్యూహన్ని రచించారని సమాచారం.తెలంగాణలో టిడిపి రాజకీయంగా నిలబడాలని కోరుకొంటుంది. అయితే టిఆర్ఎస్‌తో పొత్తు కారణంగా తమ ఉనికి నిలబడే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు పార్టీ తరపున ప్రజాప్రతినిధులు కూడ ఎన్నికయ్యే అవకాశం ఉన్నందున ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a spreading a rumour on Tdp and Trs alliance in 2019 elections.Trs will offer to Tdp 12 Assembly, 2 Mp seats in 2019 elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి