ఉమ్మడి నిజామాబాద్ లో అన్ని పీఠాలు గులాబీలవే ... టీఆర్ఎస్ ప్రజాస్వామ్య ఖూనీ చేసిందన్న ఎంపీ అరవింద్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక కార్పోరేషన్ మేయర్ తో పాటు 6 మున్సిపాలిటిల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను క్లీస్ స్వీప్ చేసింది టీఆర్ఎస్. నిజామాబాద్ కార్పోరేషన్ లో మెజారిటి రాకపోయినా ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యుల సహకారంతో మేయర్ పదవిని దక్కించుకుంది. ఆర్మూర్, కామారెడ్డీ, బోధన్ మున్సిపాలిటిల్లో చైర్మన్ పదవులు ముందుగా ప్రచారంలో ఉన్న వారికి కాకుండా అనూహ్యంగా కొత్త వారికి దక్కాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ వే అన్ని పీఠాలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ వే అన్ని పీఠాలు

నిజామాబాద్ కార్పోరేషన్ మేయర్ గా దండు నీతూ కిరణ్ (11డివిజన్) ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎంకి చెందిన ఎండీ ఇద్రిస్ ఖాన్ (14డివిజన్) అయ్యారు. ఆర్మూర్ చైర్ పర్సన్ గా పండిత్ వినిత, వైస్ చైర్మన్ గా మున్ను భాయ్ ఎన్నికయ్యారు. కామారెడ్డి చైర్ పర్సన్ గా కుమారి జాహ్నవి, వైస్ చైర్మన్ గా ఇందు ప్రియ ఎన్నికయ్యారు.బోధన్ చైర్ పర్సన్ గా తూము పద్మ, వైస్ చైర్మన్ సోయేల్ ఎన్నికయ్యారు. బాన్సువాడ చైర్మన్ గా జంగం గంగాధర్, వైస్ చైర్మన్ గా జుబేర్ ఎన్నికయ్యారు.భీంగల్ చైర్ పర్సన్ గా మల్లెల రాజశ్రీ, వైస్ చైర్మన్ గా భగత్ ఎన్నికయ్యారు.ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కుడుముల సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ గా ముస్త్యాల సుజాత ఎన్నికయ్యారు.

బిజేపి నిజామాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైందన్న మంత్రి ప్రశాంత్

బిజేపి నిజామాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైందన్న మంత్రి ప్రశాంత్

ఒక్క నిజామాబాద్ కార్పోరేషన్ లో డిప్యూటి మేయర్ పదవి మాత్రమే ఎంఐఎంకి దక్కింది. నిజామాబాద్ మేయర్ పదవితో పాటు, మిగితా మున్సిపాలిటిల్లో చైర్నన్, వైస్ చైర్మన్ పదవులన్నీ టిఆర్ఎస్ పార్టికే దక్కాయి.నిజామాబాద్ జిల్లాలో అత్యదిక వార్డులు టిఆర్ఎస్ గెలించిందని, బిజేపి నిజామాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైందన్నారు మంత్రి ప్రశాంత్. తనను మేయర్ గా ఎన్నుకున్న కేసిఆర్ కి, జిల్లా నాయకులకి ధన్యవాదాలు తెలిపారు మేయర్ నీతు కిరణ్.

కాంగ్రెస్ టిఆర్ఎస్ కి అమ్ముడుపోయిందన్న ఎంపీ అరవింద్

కాంగ్రెస్ టిఆర్ఎస్ కి అమ్ముడుపోయిందన్న ఎంపీ అరవింద్

నిజామాబాద్ కార్పోరేషన్ లో కాంగ్రెస్ పార్టి మరోసారి టిఆర్ఎస్ కి అమ్ముడుపోయిందని, ఆ పార్టి రాష్ట్రంలో కనుమరుగైందని అన్నారు. టిఆర్ఎస్ పార్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఎంపి అరవింద్ అన్నారు. కేసిఆర్ ఎంఐఎంకి గులాం గురి చేస్తున్నడని నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో మరోసారి రుజువైందన్నారు అరవింద్. ఇందురు ప్రజలు తమకే ఓట్లేసారని, నైతిక విజయం తమదేనన్నారు.

కేసీఆర్‌ హుందాతనం కేవలం ప్రెస్‌మీట్‌లకే పరిమితమన్న బీజేపీ ఎంపీ

కేసీఆర్‌ హుందాతనం కేవలం ప్రెస్‌మీట్‌లకే పరిమితమన్న బీజేపీ ఎంపీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుందాతనం కేవలం ప్రెస్‌మీట్‌లకే పరిమితమైందని బిజెపి పార్లమెంట్‌ సభ్యుడు అరవింద్‌ విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ నిజామాబాద్‌లో భూస్థాపితం అయ్యిందన్నారు. కాంగ్రెస్‌ సభ్యులు ఇద్దరు అమ్ముడుపోయారని అన్నారు. ఆర్మూర్‌లో ఒక బీజేపీ కౌన్సిలర్‌ను ముట్టుకున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాతనం ఎలా ఉంటుందో నిజామాబాద్‌ ఎన్నిక విధానం చూసి నేర్చుకోండని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+