జాతీయ రాజకీయాల్లో పాత్ర పై తేల్చుడే - 13 తీర్మానాలివే : సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ..!!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు సర్వం సిద్దమైంది. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. అర్ద్రరాత్రి నుంచే వేడకలు మొదలయ్యాయి. పార్టీ 21 ఏళ్లు పూర్తి చేసుకొని 22వ యేట అడుగు పెట్టబోతోంది. పార్టీ అధినేత..ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ - ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 13 తీర్మానాల ఆమోదానికి నిర్ణయించారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పాత్రపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు.

పార్టీ - జాతీయ రాజకీయాలే అజెండా

పార్టీ - జాతీయ రాజకీయాలే అజెండా

జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూనే.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల ప్రస్తావనతోపాటు, పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు. అలాగే 13 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనా తీరును సమీక్షించనున్నారు.

తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్ష చూపుతున్నదనే వాదన వినిపిస్తుండటం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి ప్లీనరీకి పార్టీ వ్యూహకర్తలు జాతీయ మీడియాను ఆహ్వానించారు.

13 తీర్మానాలు - కేంద్రం పైన ఒత్తిడి పెంచేలా

13 తీర్మానాలు - కేంద్రం పైన ఒత్తిడి పెంచేలా

ప్రతినిధుల సభను ఉదయం 11 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు.

ఇప్పటికే తీర్మానాల వారీగా వక్తల పేర్లను ఖరారు చేశారు. వరి కొనుగోలు అంశం పైన వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి.. కేంద్రం పన్నుల వాటా పైన మంత్రి హరష్ రావు.. క్రిష్ణా జిలాల అంశం పైన కడియం శ్రీహరి తీర్మానాలు ప్రతిపాదించనున్నారు. దళిత బంధు దేశంలో అమలు చేయాలని సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రతిపాదిస్తారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం పైన ఉత్కంఠ

సీఎం కేసీఆర్ ప్రసంగం పైన ఉత్కంఠ

ధరల పెరుగుదల పై పల్లా రాజేశ్వర రెడ్డి ప్రవేశ పెట్టే తీర్మానం పైన చర్చ...ఆమోదం ఉంటాయి. కేంద్ర వైఖరి పై పోరాటం పైన లోక్ సభలో పార్టీ నేత నామా నాగేశ్వర రావు తీర్మానం ప్రవేశ పెడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పైన ఉత్కంఠ నెలకొని ఉంది.

ఈ వేదిక నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పైన ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న దానికి కొనసాగింపుగా మరింత స్పష్టంగా ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీ జాతీయ స్థాయిలోనే ఆసక్తి కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+