తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 'బలపడుతున్న టీఆర్ఎస్, 103 నుంచి 106 సీట్లు ఖాయం'
హైదరాబాద్/తాండూరు: అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెరాసనే గెలుస్తుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం చెప్పారు. తాండూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు.

ఆ పార్టీలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు
ఓ వైపు రాష్ట్రాన్ని 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఉంటే, మరోవైపు తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాడి, నాలుగున్నరేళ్లు అభివృద్ధి చేసిన తెరాస ఉందని కేసీఆర్ చెప్పారు. మధ్యలో ఒకటి రెండు పార్టీలు ఉన్నాయని, వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఎన్నికలకు తెలంగాణకు ఎంతో ముఖ్యమైన ఘట్టమని చెప్పారు. ఎన్నికల్లో గెలవాల్సింది అభ్యర్థులు కాదని, ప్రజలు, వారి అభీష్టమని చెప్పారు. హడావుడిగా కాకుండా, ఆలోచించి ఓటు వేయాలన్నారు.

తెరాసకు 103 నుంచి 106 సీట్లు ఖాయం
తెరాసకు 103 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు అన్నీ చెబుతున్నాయని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ గెలవడం ఖాయమన్నారు. సర్వేలు కూడా అవే చెబుతున్నాయని అన్నారు. రోజు రోజుకు తెరాస గ్రాఫ్ పెరుగుతోందని చెప్పారు. తాండూరులో స్టోన్ కటింగ్ ఇండస్ట్రీ పెడతామన్నారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకు వెళ్తోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెవవేరితేనే నిజమైన ప్రజాస్వామ్యమన్నారు.

చంద్రబాబును మోసుకొచ్చారు
తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకు వచ్చానని కేసీఆర్ చెప్పారు. మనం ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించామని చెప్పారు. తెరాసను ఢీకొట్టడం కాంగ్రెస్ వల్ల కాదని చెప్పారు. మనలను ఢీకొట్టలేని కాంగ్రెస్, అమరావతికి వెళ్లి చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నారని చెప్పారు. తాండూరుకు నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును తెలంగాణకు మోసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని కాగ్నా నదిలో కలపాలన్నారు. ఇంకా తెలంగాణకు వలసవాదుల పాలన అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబును మోసుకొస్తున్నారని, కానీ వారికి బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ టిక్కెట్లు అమ్ముకున్నది
పొరపాటును కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరుసటి రోజే కరెంట్ కష్టాలు మొదలవుతాయని చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కన్నీళ్లు తప్పవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నదని చెప్పారు. టిక్కెట్ కోసం క్యామ మల్లేష్‌ను కాంగ్రెస్ పార్టీ రూ.3 కోట్లు అడిగిందని చెప్పారు. గెలవని సీటు కోసం ఓట్లు దండుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ కోసం పని చేసిన వారికి టిక్కెట్ ఇవ్వలేదని చెప్పారు. త్యాగాల తెలంగాణను కూటమి చేతుల్లో పెడదామా అన్నారు.

సోనియా గాంధీ మొదటిసారి వచ్చారా?
తెలంగాణ వచ్చాక సోనియా గాంధీ తొలిసారి వచ్చారని చెబుతున్నారని, కానీ కరీంనగర్, చేవెళ్ల సభల్లో పాల్గొన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఐదారు సభల్లో పాల్గొన్నారని చెప్పారు. 2004లో తమతో పొత్తు పెట్టుకొని గెలిచినందుకు మీకు అధికారం వచ్చిందని, అ తర్వాత 2014లో మీరు దిక్కులేక, తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారన్నారు. 2014లో దేశంలో, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారని, కానీ ప్రజలు అప్పుడు మీకు ఓటు వేయలేదని చెప్పారు. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, సంపద పెంచామని, ఇంకా పెంచుతామని చెప్పారు. తెరాస కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కచ్చితంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు. మహేందర్ రెడ్డి మంచి వ్యక్తి అని, ఆయన మెడికల్ సీట్ కోరారని, అలాగే స్టోన్ ఇండస్ట్రీ కోరారని, మనం అధికారంలోకి రాగానే వాటిని వచ్చేలా చేద్దామన్నారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!











Click it and Unblock the Notifications