కొత్త మలుపు: శిరీషనే కాదు,తేజస్వినిని వదిలించుకోవాలని, ఇవీ రాజీవ్ రాసలీలు!..

తెర పైకి ఇప్పుడు మరో కథ కూడా వచ్చింది. అటు తేజస్వినిని సైతం రాజీవ్ వదిలించుకోవాలనుకున్నాడనేది ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త మలుపు.

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో అసలేం జరిగిందనే దానిపై ఊహాగానాలే ఎక్కువగా ప్రచారంలో ఉండగా.. వెలికివచ్చిన నిజాలపై ఇంకా అనుమానాలు ఊగిసలాడుతూనే ఉన్నాయి. హత్య అంటూ శిరీష కుటుంబ సభ్యులు.. తమ కొడుకేమి తెలియదంటూ అటు శ్రవణ్ తల్లిదండ్రులు వాదిస్తుండటంతో.. కేసు చుట్టూ చిక్కుముడులు అల్లుకుంటూనే ఉన్నాయి.

శిరీష కేసులో ఇప్పటివరకు తెలియవస్తున్న సమాచారం మేరకు.. ఆమెను వదిలించుకోవడానికే రాజీవ్ శ్రవణ్ తో కలిసి పథకం పన్నాడనేది ఒక వెర్షన్ అయితే, శ్రవణే డబుల్ గేమ్ ఆడి శిరీషను వ్యభిచారిణిగా చిత్రీకరించబోయాడనేది మరో వెర్షన్. రాజీవ్ గర్ల్‌ఫ్రెండ్ తేజస్వినితో గొడవల వల్లే శిరీషకు ఈ దుస్థితి తలెత్తిందని.. తేజస్విని కోసం శిరీషను రాజీవ్ వదిలించుకోవాలనుకన్నాడని, ఈ క్రమంలో శ్రవణ్ తో కలిసి ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లారనేది చూచాయగా తెలుస్తున్న కథ.

కొత్త మలుపు:

కొత్త మలుపు:

కానీ తెర పైకి ఇప్పుడు మరో కథ కూడా వచ్చింది. అటు తేజస్వినిని సైతం రాజీవ్ వదిలించుకోవాలనుకున్నాడనేది ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త మలుపు. నాలుగైదు నెలలకొకసారి గర్ల్ ఫ్రెండ్స్‌ను మార్చే అలవాటున్న రాజీవ్.. అదే తరహాలో తేజస్వినిని కూడా వంచించడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు. రాజీవ్ మోసాన్ని తట్టుకోలేని తేజస్విని పోలీస్ కేసు పెడుతానని బెదిరించిందని, ఇదే క్రమంలో రాజీవ్ తల్లిదండ్రులతోనే విషయం గురించి చెప్పిందని తెలుస్తోంది.

రాజీవ్ తల్లిదండ్రులతో తేజస్విని

రాజీవ్ తల్లిదండ్రులతో తేజస్విని

నేరుగా విజయవాడ వెళ్లిన తేజస్విని.. రాజీవ్ తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పినట్లు సమాచారం. అమ్మాయిలకు దగ్గరవడం.. వారి అశ్లీల ఫోటోలు, వీడియోలు తన సెల్ ఫోన్ లో బంధించి.. చివరకు వాటితోనే బ్లాక్ మెయిల్ చేసి వదిలించుకోవడం రాజీవ్ కు ముందునుంచి ఉన్న అలవాటేనని తాజా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

ఇద్దరిని వదిలించుకోవాలని

ఇద్దరిని వదిలించుకోవాలని

ఈ నేపథ్యంలోనే అటు తేజస్వినిని, ఇటు శిరీషను ఇద్దరిని వదిలించుకోవడానికి రాజీవ్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. అటు తేజస్వినితో ప్రేమాయణం కొనసాగిస్తుండగానే.. మరో యువతితో పరిచయం పెంచుకున్న అతను.. ఆమెను కూడా మోసం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రాజీవ్‌కు చెందిన ఆర్జే స్టూడియోలోని హార్డ్ డిస్క్‌లో అనేక ఫోటోలు, వీడియోలు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వీటన్నింటిని బట్టి చూస్తే.. రాజీవ్ ఎంతటి మేకవన్నె పులి అనేది స్పష్టమవుతోంది.

శిరీషతో పాటు నలుగురైదుగురితో!

శిరీషతో పాటు నలుగురైదుగురితో!

ఓవైపు శిరీషతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే.. మరో నలుగైదురుగురు అమ్మాయిలతో రాజీవ్ సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు తాజా విచారణలో గుర్తించారు. శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్.. వారికి తెలియకుండా అశ్లీల ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి.. చివరికి వారిని వదిలించుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+