గాల్లోకి ఎగిరిన రాంచరణ్ విమానాలు: హైదరాబాద్-తిరుపతి తొలి సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ డైరెక్టర్‌గా ఉన్న ట్రూజెట్ విమాన సేవలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రూజెట్ తొలి విమాన సర్వీసును కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి పి శోక్‌గజపతిరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి కెటి రామారావు, రాంచరణ్, ట్రూజెట్ ఎండీ ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తదితర నగరాలకు కూడా ట్రూజెట్ విమానాలను నడుపనున్నట్లు యాజమాన్యం తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications