'భారత్‌పై పాజిటివ్‌గా అమెరికా యంత్రాంగం', కన్సాస్ కాల్పులపై...

భారత్ - అమెరికా సంబంధాల పైన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో ఉందని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు

న్యూఢిల్లీ: భారత్ - అమెరికా సంబంధాల పైన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో ఉందని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు.

ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. సీనియర్ కేబినెట్‌ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి ట్రంప్‌ యంత్రాంగం ఆసక్తి కనబరుస్తోందన్నారు.

america

మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా హయాంలో ప్రారంభమైన ఇండో-అమెరికా వ్యూహ్యాత్మక చర్చలు కొనసాగుతాయన్నారు. ఈ చర్చల కోసం అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రెక్స్‌ టిల్లర్సన్‌, కామర్స్‌ సెక్రటరీ రోస్‌ భారత్‌ పర్యటనకు రానున్నారన్నారు.

కన్సాస్ కాల్పుల్లో తెలుగు వాడైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీని పైన కూడా జయశంకర్ అక్కడి అధికారులతో మాట్లాడారు. జాత్యాహంకార హత్య కోణంలో కేసును దర్యాఫ్తు చేస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+