వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నులు పెరుగుతాయని చెబుతున్నారు, మరి వసతుల మాటేమిటి: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా విలీనం గ్రామపంచాయతీల్లో రెండు నుంచి మూడేళ్ల పాటు ప్రస్తుత పన్నులనే కొనసాగించే ఆలోచన ఉందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ప్రకటన చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఇక నుంచి నగర పంచాయతీలు ఉండవని, అన్నీ మున్సిపాలిటీలే అవుతాయని చెప్పారు. మున్సిపాలిటీల్లో విలీనమైతే పన్నులు పెరుగుతాయని అంటున్నారని, పన్నులు పెరిగినపుడు వసతులు కూడా పెరుగుతాయి కదా అన్నారు.

TS Assembly passes new Panchayat Raj Bill, 1300 Lambadi thandas set to become panchayats,

పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపాలిటీ చట్టసవరణ, ప్రయివేటు
విశ్వవిద్యాలయాల బిల్లులకు మండలిలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో చట్టసవరణ ఆమోదం ద్వారా మున్సిపాలిటీల సంఖ్య 72 నుంచి 147కు పెరుగుతుందన్నారు.

జనాభా 42-43శాతానికి చేరనుందని చెప్పారు. రాష్ట్రంలో పదిహేను వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు.

ఉట్నూరు, ఆసిఫాబాద్‌, భద్రాచలం, సారపాకను మున్సిపాలిటీలుగా మార్చేందుకు గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపించామని, అప్పటి వరకు గ్రామపంచాయతీలుగా కొనసాగుతాయని కేటీఆర్ తెలిపారు. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా స్పీకర్‌ మధుసూధనాచారి మండలి సమావేశాల తీరును వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించారు.

జిహెచ్ఎంసిలో అగ్ని ప్రమాదంపై

జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్‌లో అవినీతి జరిగిన కారణంగానే దానికి సంబంధించిన రికార్డులు అగ్ని ప్రమాదంలో నాశనం అయ్యాయని కేటీఆర్ తెలిపారు. దీనిపై విచారణలో అవినీతికి కారణమైన పద్నాలుగుమంది ఇంజినీర్లను అరెస్టు చేశామన్నారు.

English summary
The Telangana State Legislative Assembly on Thursday passed a new Panchayat Raj Bill which facilitates formation of new panchayats and municipalities in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X