కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం.. బేడీలు వేసి రాష్ట్రమంతా తిప్పుతాం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ మెడలు వంచేది బీజేపీయేనన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని హెచ్చ‌రించారు. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కేసీఆర్ అని విమర్శించారు. 317 జీవోను తెచ్చి ఉద్యోగులను నట్టేట ముంచుతున్నాడ‌ని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికరంలోకి రాగానే ఈ జీవోను సవరిస్తామని చెప్పారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని దుయ్యబట్టారు. జైలుకు పంపించ‌డం ప‌క్కా అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Recommended Video

    BJP Is Not Biryani That KCR Can Easily Eat | Big Wigs Warns CM | Oneindia Telugu
    కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కేసీఆర్

    కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కేసీఆర్


    రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్ర‌జా వ్యతిరేక పాలనపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. పోరాటంలో వెనక్కి తగ్గొదని ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. మహబూబ్‌న‌గ‌ర్‌లో 317జీవోకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. గడీల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కేసీఆర్ అని మండిపడ్డారు.

    కేసీఆర్‌కు బేడీలు వేసి హెలికాప్టర్‌లో రాష్ట్రమంతా తిప్పుతాం.

    కేసీఆర్‌కు బేడీలు వేసి హెలికాప్టర్‌లో రాష్ట్రమంతా తిప్పుతాం.


    కేసీఆర్ ఏర్పాటు చేస్తామన్న థర్డ్ ఫ్రంట్ అంతా డ్రామా అని బండి సంజయ్ విమర్శించారు. కల్వకుంట కుంటుంబం అవినీతిపై తప్పక విచారణ చేస్తామన్నారు. అవినీతి విచారణ భయంతోనే థర్డ్ ప్రంట్ అంటూ కొత్త నాటకానికి కేసీఆర్ తెరతీశారని ఆరోపించారు. కేసీఆర్ ని వదిలిపెట్టేది లేదని.. కూకటివేళ్లతో సహ పెకిలిస్తామన్నారు. కేసీఆర్ కు బేడీలు వేసి హెలికాప్టర్ లో రాష్ట్రమంతా తిప్పుతామన్నారు. ఎన్ని కూటములు ఏర్పాటు చేసినా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

     317 జీవోను సవరించేవరకు పోరాటం

    317 జీవోను సవరించేవరకు పోరాటం

    ఉద్యోగులు, ఉపాధ్యాయులెవరూ ఆందోళన చెందవద్దని బండి సంజయ్ అన్నారు. 317జీవోను సవరించేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. దరిద్రపుగొట్టు జీవోను కేసీఆర్ తెచ్చి ఉద్యోగుల్లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య గొడవలు పెట్టారని దుయ్యబట్టారు. ప్రభుత్వ చర్యలతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞ‌ప్తి చేశారు. త్వరలోనే 317 జీవోకు వ్యతిరేకంగా హదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలనను బొంద పెట్టేందుకు ఉద్యోగులంతా ఏకం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+