ఓటమి భయంతోనే ఫామ్‌హౌస్ నుంచి బయటకు.. నిరంకుశ పాలన గుణపాఠం తప్పదు : కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణలో నిరంకుశ పాలన రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక సీఎం కేసీఆర్ డిప్రేషన్‌కు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ డిప్రేషన్‌లోనే ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం
ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా బీజేపీ పార్టీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయింది. యువ తెలంగాణ పార్టీని అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సర్టికల్ స్ట్రయిక్‌పై నోటికొచ్చినట్లు మాటలు ..
తెలంగాణ రాష్ట్రం 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిందన్నారు బండి సంజయ్. కానీ అధికార మాత్రం కేసీఆర్ కుటుంబం చేతుల్లో చిక్కుకుందని దుయ్యబట్టారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని టెన్‌జన్ పథ్ స్క్రిప్ట్‌నే కేసీఆర్ చదువుతున్నారని విమర్శించారు. సర్జికల్ స్ట్రయిక్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఫామ్‌హౌస్‌ను వీడి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు.
Recommended Video

ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకం కాదు
ఉచిత విద్యుత్ సరఫరాకు బీజేపీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలవుతోందని చెప్పారు. డిస్కంలకు చెల్లించాల్సిన వాటికీ ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్ల పెడతామని కేంద్రం ఎప్పుడు చేప్పలేదని దుయ్యబట్టారు. మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని మండిపడ్డారు. కావాలనే కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications