Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యంగంపై నమ్మకం లేకపోతే.. సీఎం పీఠం నుంచి దిగిపో : కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ రాజ్యాంగమంటే గిట్టదని.. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ... ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలనే కొత్త‌ కుట్రలకు కేసీఆర్ తెరతీశారని బండి దుయ్యబట్టారు.

కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే..

కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే..

రాజ్యాంగం నచ్చకపోతే.. వెంటనే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబం మాత్రమే రాజ్యం ఏలాలన్నది కేసీఆర్ కుట్రగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు లేకుండా.. కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యంగా ఉందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు.

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు..

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు..

దేశ రాజ్యాంగంపై కేసీఆర్‌కి నమ్మకం లేనప్పుడు .. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదని బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా ఉన్న ఇబ్బందులేమిటో తెలపాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే.. రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉంది.. ఇప్పటి వరకు 105 సార్లు సవరణలు చేసుకున్నామని గుర్తుచేశారు. కానీ రాజ్యాంగాన్నే పూర్తిగా తిరగరాయాలనడం.. కేసీఆర్‌లో అహంకారం ఏ విధంగా ఉందో అర్థమవుతోందని దయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చితే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడని ఆరోపించారు.

Recommended Video

    KCR కు Ambedkar అంటే గిట్టదు - Manda Krishna Madiga | Oneindia Telugu
    అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు..

    అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు..

    గులాబీ పార్టీ పాలనలో అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించడానికి రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలు కేసీఆర్ చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. దురహంకారంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు స్పందించాలన్నారు. కేసీఆర్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా న్యాయవాదులు పోరాడాలని ఆయన కోరారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, 317 జీవో సహా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుంని బండి సంజయ్ స్పష్టం చేశారు. రైతుల‌కు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+