Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఆర్ఎస్ Vs కాంగ్రెస్, గెలుపెవరిది - జాతీయ సర్వేలో ఆసక్తికర ఫలితాలు..!!

తెలంగాణలో హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోది. ఈ సారి కాంగ్రెస్ తెలంగాణలో పాగా వేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హ్యాట్రిక్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ మేము సైతం అంటూ రేసులో నిలుస్తోంది. ఈ సమయంలోనే సర్వే సంస్థలు ఆసక్తి కర ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య పోటీలో పలు కీలక అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరు గెలిచినా గెలుపు - ఓటమి మధ్య తేడా చాలా స్వల్పమని స్పష్టం చేస్తున్నాయి.

సంక్షేమమే అస్త్రంగా : తెలంగాణలో గెలుపు కోసం నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ సుడిగాలి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. బీజేపీ ఈ రోజు తమ అభ్యర్దుల జాబితా ప్రకటనకు సిద్దం అయింది. ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతున్న సమయంలో తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశం పైన సర్వే సంస్థలు ఆసక్తి కర ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

TS Elections: India Today political Exhange predicts neck to neck contest between the Congress and the BRS

కాంగ్రెస్ గ్యారంటీ పథకాలతో అధికారం ఖాయమనే నమ్మకంతో ఉంది. ఈ పథకాలకు కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. రెండు పార్టీల సంక్షేమ పథకాలే ఈ సారి ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియా టూడే పొలిటికల ఎక్స్చేంజ్ తెలంగాణలో ఎన్నికల పై ప్రీ పోల్ సర్వే అంచనాలను వెల్లడించింది.

తాజా సర్వే లెక్కల్లో : 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, బీజేపీ 1, ఇతరులు 11 సీట్లు గెలుచుకున్నాయి. ఓటింగ్ శాతాల లెక్కన బీఆర్ఎస్ 47, కాంగ్రెస్ 28, బీజేపీ 7 శాతం, ఇతరులు 18 శాతం ఆ ఎన్నికల్లో ఓట్లను సొంతం చేసుకున్నాయి. ఈ సారి ఎన్నికల్లోనూ 95-105 స్థానాలు సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు రాహుల్ మాత్రం కాంగ్రెస్ ప్రభంజనం ఈ సారి ఖాయమని చెబుతున్నారు.

ఈ సమయంలోనే తాజాగా వెల్లడైన సర్వేలో ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ 38 శాతం ఓట్లు, కాంగ్రెస్ 39 శాతం ఓట్లు, బీజేపీ 16 శాతం ఓట్లు, ఇతరులు 7 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వెల్లడించారు. ఈ లెక్కన ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ 54 సీట్లు, బీజేపీ 8 సీట్లు, బీఆర్ఎస్ 49, ఇతరులు 8 సీట్లు దక్కించుకొనే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.

TS Elections: India Today political Exhange predicts neck to neck contest between the Congress and the BRS

హోరా హోరీ పోరు: ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసే పలు అంశాలను ఈ సర్వే సంస్థ విశ్లేషించింది. కర్ణాటకలో గెలిచిన సమయం నుంచి కాంగ్రెస్ తెలంగాణ పైన గురి పెట్టింది. ఇతర పార్టీల్లోని ముఖ్యులు కాంగ్రెస్ లో చేరిక ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతం అయినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో హైకమాండ్ నేరుగా తెలంగాణ ఎన్నికలను పర్యవేక్షిస్తోంది.

సోనియా గ్యారంటీ పథకాలను ప్రకటించగా..రాహుల్ వాటి అమలు బాధ్యత తమదేనని హామీ ఇస్తున్నారు. ఇటు కేసీఆర్ తెలంగాణలో తన పాలనలో వచ్చిన మార్పులు..ఫలితాలను వివరిస్తూ కొనసాగాలంటే తమకు అధికారం అవసరమని చెబుతున్నారు. హ్యాట్రిక్ ఖాయమని ధీమాగా ఉన్నారు. బీజేపీ తాము పోటీలో ఉన్నామని చెబుతోంది. ఇక, ఇతర పార్టీల ప్రభావం కీలకంగా మారుతోంది. దీంతో..ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+