మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం -హెల్ప్‌లైన్..!!
మణిపూర్ అట్టుడుకుతున్నది. అక్కడి తెలంగాణ విద్యార్ధులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హింసాత్మక ఘటనలను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం పారామిలటరీ బలగాలను సైతం మోహరించింది. పలువురు విద్యార్ధులకు తిరిగి రావటం కోసం తెలంగాణ పోలీసులను సంప్రదిస్తున్నారు. ఆ రాష్ట్ర అధికారులతో తెలంగాణ ఉన్నతాధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ప్రత్యేక విమానంతో పాటుగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసారు.
ఇప్పటికే మణిపూర్ సీఎస్‌తో తెలంగాణ సీఎస్ శాంతికుమారి మాట్లాడారు. మన విద్యార్థులు, పౌరులను సురక్షితంగా పంపించే విషయమై చర్చించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో డీజీపీ అంజనీకుమార్ మణిపూర్‌లో చిక్కుకున్న మన వాళ్ల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 7901643283ను, [email protected] మెయిల్‌ను అందుబాటులో ఉంచారు. ఈ హెల్ప్‌లైన్‌కు డీఐజీ సుమతిని ఇంచార్జిగా నియమించారు. ఆమె బాధితులకు ధైర్యం చెప్తూ, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నారు. హెల్ప్‌లైన్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే 45 కాల్స్ వచ్చినట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. వీరిలో విద్యార్థులు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునేవారు, చిరువ్యాపారులు ఉన్నారని పేర్కొన్నారు.

కొందరు తెలుగు విద్యార్థులు హాస్టళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్టు అధికారులకు సమాచారం అందింది. ఒక్క ఇంఫాల్ ఎన్‌ఐటీలోనే సుమారు 150 మంది తెలుగు విద్యార్థులున్నట్టు సమాచారం. వివిధ ప్రాంతాల్లో ఉన్న కొందరు తెలుగువారు తిండికి, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. అక్కడి పోలీసులు 144 సెక్షన్ విధించి.. అడుగడుగునా జామర్లు పెట్టడంతో ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మణిపూర్‌లో తెలంగాణకు చెందిన 250 మంది విద్యార్థులను విమానం ద్వారా రాష్ట్రానికి తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications