వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఎస్ ఐపాస్ ఆవిష్కరించిన సిఎం కెసిఆర్: పది రోజుల్లో అనుమతులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పారిశ్రామిక వర్గాలను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కృతమైంది. తెలంగాణ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుక్రవారం ఆవిష్కరించారు.

నగరంలోని హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన టిఎస్ ఐపాస్ లాంచ్ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు కెటిఆర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ టీఎస్ ఐపాస్‌ను కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 2,500మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరైయ్యారు.

TS iPASS launched by CM KCR

టిఎస్ ఐపాస్ ద్వారా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు కల్పించే సదుపాయాలు:

-భూమి, నీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 150 పారిశ్రామికవాడలు, 28 సెజ్‌లు
- పరిశ్రమల ఏర్పాటుకు లక్షా 60 వేల ఎకరాల భూమి ఇప్పటికే సిద్ధం
- కోరుకున్న చోట, అవసరమైనంత భూమి
- అన్ని పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా
- వాటర్‌గ్రిడ్ పైపులైన్ల ద్వారా ప్రాజెక్టుల నుంచి చాలినంత నీరు
- ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, రెండు వారాల్లోగానే అనుమతులు మంజూరు
- ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్ సెల్
- పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
- 0% అవినీతి.. 100 శాతం పారదర్శకత
- సెల్ఫ్ సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యం
-పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం
- అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ రింగురోడ్డు, ప్రతీ జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి నాలుగు లేన్ల రహదారులు.

English summary
At a mega event attended by corporate bigwigs,captains of industries and envoys of more than 20 major countries in the world,the Telangana government unveiled its maiden and much-hyped industrial policy,here today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X