హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ - తెలంగాణ మ‌ధ్య‌ జల జగడం.. జగన్ సర్కార్ చిల్లరగా వ్యవహరిస్తోంది : మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల జగడం మరో సారి తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకుంటుందని జగన్ సర్కార్ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తికి అడ్డుకట్ట వేయాలని లేఖలో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జాలాల వినియోగంలో జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీటి వినియోగంపై కేఆర్ఎంబీకి ఏపీ ఎలా ఫిర్యాదు చేస్తోందని ప్ర‌శ్నించారు..

ఏపీ ప్ర‌భుత్వం చిల్లర‌గా వ్వ‌వ‌హ‌రిస్తోంది..

ఏపీ ప్ర‌భుత్వం చిల్లర‌గా వ్వ‌వ‌హ‌రిస్తోంది..

కృష్ణా జాలా విషయంలో ఏపీ ప్రభుత్వానివి అర్ధం పర్థం లేని వాదనలు అని జగదీశ్ రెడ్డి విరుచుకుపడ్డారు. చిల్లర మల్లరగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జును సాగర్ నుంచి తాము నీటిని వినియోగించడం లేదని తెలిపారు. జగన్ ప్రభుత్వం చీటికి మాటికీ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. అసంబద్ధమైన ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ ఏపీ ప్రభుత్వం తన గౌరవాన్ని మరింత దిగజార్చుకుంటుందని దుయ్యబట్టారు. చిల్లర వ్యవహరాలను ఏపీ మానుకోవాలని హితవు పలికారు.

మేము ఏపీపై ఫిర్యాదు చేయ‌లేమా ?

మేము ఏపీపై ఫిర్యాదు చేయ‌లేమా ?

పవన్ గ్రిడ్‌లను కాపాడుకోనేందుకు కొన్ని సార్లు నాగార్జున సాగర్ నీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. అది కూడా ఐదు, పది నిమిషాలు మాత్రమే అని చెప్పారు. ఇలా విద్యుత్ ఉత్పత్తి చేయడం సహజమని పేర్కొన్నారు. కేఆర్ఎంబీకి ఏపీ చేసిన ఫిర్యాదులో సహేతుక లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపివేసింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అక్రమంగా నీటిని వినియోగిస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలచుకుంటే కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయలేమా అని నిలదీశారు.

3 తెలంగాణ‌పై కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

3 తెలంగాణ‌పై కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

ఎలాంటి మందస్తు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తోందని ఏపీ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. వేసవి కాలంలో తాగునీటి అవసరాలకు ఉన్నా వాటిని పక్కన పెట్టి విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దుర్వినియోగం చేయడం తగదని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలను నిలువరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. అక్రమ నీటి వినియోగాన్ని అడ్డుకట్ట వేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. వేసవిలో అన్ని ప్రాంతాలకు తాగనీటిని అందించాలంటే నాగార్జున సాగర్‌లో తక్షణం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వ కోరింది.

English summary
Water war again beteen AP and Telangana , minister Jagadish reddy serious on cm jagan government over power generation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X