ఎవరు ‘0’ కేంద్రమా? తెలంగాణ సర్కారా?: కేటీఆర్, మన్సుఖ్ మాండవీయ ట్వీట్ వార్
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసిన మెడికల్ కాలేజీల సంఖ్య 'సున్నా' అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదనల సంఖ్య కూడా 'సున్నా'నే అంటూ మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కౌంటర్ ఇచ్చారు.
Recommended Video
‘0' అంటూ తెలంగాణ సర్కారుపై కేంద్రమంత్రి మాండవీయ
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి 16 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, మరో 13 మెడికల్ కాలేజీలు పైప్‌లైన్‌లో ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఆదివారం వరుస ట్వీట్‌లలో పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే, ‘మన ప్రధాని మోడీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో ఇప్పుడు చెబుతాను అది ‘జీరో' అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా.. మాండవ్య సోమవారం ఒక ట్వీట్‌లో.."మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపింది? అది సున్నా అని అన్నారు. అంతేగాకాకుండా, ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు పక్షపాతం లేకుండా, తక్కువ సమయంలో అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధాని మోడీ మంజూరు చేశారని కేంద్రమంత్రి తెలిపారు.
కేంద్రం నుంచే ‘0' అంటూ కేటీఆర్ జవాబు
"మీరు ప్రతిస్పందించడానికి ఎంచుకునే ముందు మీరు సమీక్షను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. 2015-2019 మధ్య కాలంలో తెలంగాణ ఆరోగ్య మంత్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలకు మీ పూర్వీకుల ప్రతిస్పందనలు జతచేయబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలల కోసం నిరంతరం అభ్యర్థించింది, అయితే మీ ప్రభుత్వం ‘జీరో' డెలివరీ చేసిందనేది వాస్తవం' అని కేటీఆర్ ట్వీట్ చేశారు

డీపీఆర్ పంపలేదంటూ కేటీఆర్‌కు కేంద్రమంత్రి మాండవీయ కౌంటర్
ఇక కేటీఆర్‌కు ప్రతిస్పందనగా.. మండవీయ, తనకు ముందుగా ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నుంచి ఆగస్టు 2019 లో తెలంగాణకు ఒక ఉత్తర ప్రత్యుత్తరాన్ని పంచుకున్నారు. పరిశీలన కోసం మార్గదర్శకాల ప్రకారం.. రెండు తెలంగాణ జిల్లాల్లో జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను పంపాలని కోరారు. 2021 డిసెంబర్‌లో పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని కూడా జతపరిచారు. "అన్ని గౌరవాలతో, దయచేసి నా పూర్వీకుడి లేఖలోని మూడవ పేరా, ఇటీవల పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని చదవండి. దయచేసి అవసరమైన డిపిఆర్‌తో అధికారిక ప్రతిపాదన పంపమని తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఎల్లప్పుడూ అభ్యర్థించిందని, మార్గనిర్దేశం చేస్తుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి' అని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పేర్కొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఖాళీలు ఇప్పటికీ భర్తీ చేయలేదన్న కేటీఆర్
అయితే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన బీబీనగర్ ఎయిమ్స్‌లో ఇప్పటి వరకు 544 ఉద్యోగాలను కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్పీఏ ప్రభుత్వం అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications