TS RTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. అందుబాటులోకి రానున్న జనరల్ రూట్ పాస్..!

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులను పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పలు టికెట్లు కూడా ఇప్పటికే తీసుకొచ్చింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనరల్ రూట్ పాస్ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ ను అందుబాటులోకి తేనుంది. ఎమినిది కిలోమీటర్ల పరిధిలో రాకపోకాలు సాగించే వారు ఈ పాస్ తీసుకోవచ్చు. మే 27 జనరల్ రూట్ పాస్ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ పాస్ కూడా మామూలు పాస్ ల్లాగా నెల రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆర్డీనరి రూట్ బస్ పాస్ కు రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 లుగా ధర నిర్ణయించారు. పాస్ మొదటిసారి తీసుకుంటే ఐడీ కార్డుకో కోసం రూ.50 అదనంగా వసూల్ చేస్తారు. జనరల్ రూట్ బస్సు పాస్ లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 162 రూట్లలో అందుబాటులోకి తేనున్నారు. ఈ పాస్ ఉపయోగించి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

rtc

ఈ పాస్ ఆదివారంతో పాటు సెలవువ దినాల్లో కూడా పని చేస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటికే సాధారణ పాస్ లు ఉన్నాయి. వీటిని చాలా మందే ఉపయోగిస్తున్నారు. ఆర్టీనరీ బస్సు పాస్ కు రూ.1150, ఉండగా.. మెట్రో ఎక్స్ ప్రెస్ బాస్సు పాస్ కు రూ.1300 వసూలు చేస్తున్నారు. ఈ పాస్ తో గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు. అయితే ఈ బస్ పాస్ లను దూరం వెళ్లే వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని గుర్తించిన ఆర్టీసీ స్వల్ప దూరాలకు వెళ్లే వారికి కోసం జనరల్ రూట్ బస్సు పాస్ లు తీసుకురానుంది.

తక్కువ దూరం ఉన్న వారు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వీరు ఆటోకు రోజుకు రూ.40 నుంచి 60 వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే నెలకు రూ.1200 నుంచి 1800. అయితే సెలవు దినాలు, ఆదివారాలు తీసేస్తే రూ.800 నుంచి రూ.1400 అవుతుంది. అందుకే వీరు సాధారణ బస్సు పాస్ లు తీసుకోవడం లేదు. ఇది గుర్తించిన ఆర్టీసీ జనరల్ రూట్ బస్సు పాస్ లు అందుబాటులోకి తెస్తుంది.

సిటీ బస్సుల్లో ఆర్టీసీ ఇప్పటికే అనేక రకాల టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో టి-24 టికెట్ ఒక్కటి. ఈ టికెట్ సాధారణ ప్రజలకు రూ.90 అందుబాటులో ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.80 లకే ఇస్తున్నారు. ఈ టికెట్ తో సిటి బస్సుల్లో 24 గంటల పాటు తిరగొచ్చు. అలాగే ఎఫ్-24 టికెట్ కూడా తీసుకొచ్చారు. ఈ టికెట్ కు రూ.300 చెల్లించి ఫ్యామిలీలోని నలుగురు సభ్యులు 24 గంటల పాటు ఆర్టీసీలో తిరగొచ్చు. టీ-6 టికెట్ రూ.50 లకు కొనుగోలు చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు ఎటైనా తిరగొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+