గ్రూప్-1 రద్దుతో అభ్యర్థి ఆత్మహత్య
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుకావడంతో సిరిసిల్లకు చెందిన నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అనాలోచిత నిర్ణయం ఆ యువకుడికి శాపంగా మారింది.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుకావడం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆరు సంవత్సరాలు కష్టపడి గ్రూప్-1 పరీక్ష రాసి.. అర్హత సాధిస్తే.. 6 నెలల తర్వాత ఆ పరీక్ష రద్దుకావడం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నవీన్ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. రాజన్న సిరిసిల్ల బీవైనగర్ కు చెందిన నాగభూషణంకు నలుగురు కొడుకులు. అందరిలో చిన్నవాడైన నవీన్ హోటల్ మేనేజ్ మెంట్ చదివాడు.
చదువు పూర్తయిన తర్వాత ప్రయివేటు ఉద్యోగాల కోసం వెతుకుతున్న క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడంతో వాటికి సిద్ధమయ్యాడు. పరీక్ష రద్దుకావడంతో ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకున్నాడు. గ్రూప్-1కు అర్హత సాధిస్తే ఆ ఆనందం ఆరునెలలు కూడా లేకపోయిందంటూ తమ కళ్లముందే విగతజీవిగా మారిన కుమారుణ్ని చూడలేక నవీన్ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.

తన చావుకు ఎవరూ కారణం కాదని, ఉద్యోగం లేకపోవడంతో తనను తాను పనికిరానివాడిగా ఆ లేఖలో నవీన్ అభివర్ణించుకున్నాడు. సంతృప్తి లేని జీవితం తనదని, థాంక్యూ మై ఫ్యామిలీ, ఐక్విట్ అంటూ రాసిన లేఖ అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
పేపరు లీక్ కావడంతో TSPSC నిర్వహించే పలు పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పలువురు అభ్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే ఎంపికవుతామన్న నమ్మకం కలకగకపోవడంతో మెయిన్స్ కు క్వాలిఫై అయినవారంతా ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications