తెలంగాణాలో 81వేల ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ రిక్రూట్‌మెంట్స్ విధానం: చైర్మన్ ఏం చెప్పారంటే
తెలంగాణలో 81,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిద్ధమవుతోంది. దశలవారీగా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉద్యోగార్ధులకు తగిన సమయం ఇస్తూ పరీక్షలను నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్రంలో భారీ జాబ్ నోటిఫికేషన్స్ వెలువడనున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల కోసం జరగబోయే రిక్రూట్‌మెంట్లకు సంబంధించి వివిధ వివరాలను వెల్లడించారు.

డిపార్టుమెంటు అవసరాన్ని బట్టి, మొదట వచ్చిన శాఖలకు నోటిఫికేషన్లు
ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కోరింది. వివరాలు అందిన తర్వాత అధికారులు వాటిని పరిశీలించనున్నారు. శాఖల ప్రాధాన్యతపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఫస్ట్‌కమ్ సర్వ్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ జరుగుతుందని చెప్పారు. అయితే, అన్ని డిపార్ట్‌మెంట్‌లకు ఒకేసారి జిఓలు జారీ చేస్తే, డిపార్ట్‌మెంట్ అవసరాన్ని బట్టి రిక్రూట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు.

పరీక్షా సరళి, సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదు
న్యాయమైన రిక్రూట్‌మెంట్‌ను నిర్ధారించడానికి తీసుకోబోయే చర్యలపై ఆయన మాట్లాడుతూ, ఇంటర్వ్యూ ప్యానెల్‌కు అభ్యర్థుల అర్హతలు లేదా మార్కులు వెల్లడించబడవని చెప్పారు.టిఎస్పిఎస్సి పరీక్ష విధానం, సిలబస్ విషయానికి వస్తే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చాలా మంది అభ్యర్థుల గందరగోళాన్ని తొలగిస్తూ.. పరీక్షా సరళి, సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదని చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు ఆన్సర్ కీ, జవాబు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఒకేసారి 30 వేల మంది అభ్యర్థులకు కమిషన్ ఆన్‌లైన్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వనున్న ఉద్యోగాల భర్తీ కోసం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని అన్నారు. పేపర్ లీక్‌లను నిరోధించేందుకు గ్రూప్-1 పరీక్షలకు ఈ-పేపర్‌ను అందించే ఎంపికను కూడా కమిషన్ పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు . ఒకేసారి 30 వేల మంది అభ్యర్థులకు కమిషన్ ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించవచ్చని చైర్మన్ వెల్లడించారు. 30 వేల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలు రాసే వారు ఉంటే ఆన్లైన్లో నిర్వహణ సదుపాయాలను బట్టి సందర్భోచితంగా నిర్ణయం తీసుకుంటామని జనార్దన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
Recommended Video

నిర్ణీత గడువులోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం
నిర్ణీత గడువులోగా ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. న్యాయ వివాదాలు తలెత్తకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాలలో వచ్చే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అభ్యర్థులు అసత్య ప్రచారాలు చేసినట్లు గుర్తిస్తే వారిని పరీక్షలు రాయకుండానే నిషేధం విధిస్తామని హెచ్చరించారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications