టీఎస్ ఆర్జేసీ సెట్ నోటిఫికేషన్ విడుదల, మే 6న ప్రవేశ పరీక్ష
తెలంగాణలోని 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు గురుకు ల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలోని 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు గురుకు ల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటనను విడుదల చేసింది.
tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. మే 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్ ఆర్జేసీ సెట్ ను నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుము రూ. 200గా ఉంది. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు మే 1 నుంచి 5వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక ్ చేయండి
https://tsrjdc.cgg.gov.in/TSRJDCWEB20/#!/home0103prsvdf.rps












Click it and Unblock the Notifications