ఆర్టీసీ ఛార్జీలు పెంపు - కిలోమీటర్‌కు 25 పైసలు : ఏ సర్వీసుకు ఎంత - సీఎం ఆమోదంతో..!!
కొద్ది రోజులుగా అంచనా వేస్తున్న విధంగానే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు ఖాయమైంది. ఛార్జీల పెంపు అంశం పైన ఇప్పటికే టీఎస్ఆర్టీసీ అధికారులు నాలుగు రకాలుగా ప్రతిపాదనలు సిద్దం చేసారు. వీటి పైన రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు. ఎక్స్ ప్రెస్ ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని యోచిస్తున్నారు.

25 పైసల నుంచి 30 పైసల వరకు పెంపు
సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు..సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు.. మెట్రో డీలక్స్‌సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పెంచాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనుంది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో ఈ నెల నుంచి ఛార్జీల భారం మోయక తప్పేలా లేదు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. పెట్రోలు ధరలు తగ్గించటం పైన ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

పెట్రో ధరలు తగ్గినా...ఛార్జీలు పెంపు
భారీగా పెంచి..స్వల్పంగా తగ్గించటం వెనుక పరమార్ధం ఏంటని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నార ని వ్యాఖ్యానించారు. తాజాగా కేంద్రం సుంకం తగ్గించటంతో రూ.90 దిగువకు (ఆర్టీసీకి రాయితీ ధర మేరకు) చేరింది. అయినా... గతంలో చార్జీలు పెంచినప్పటి నుంచి ప్రస్తుత ధరతో బేరీజు వేసుకుంటే లీటరుపై రూ.20కి పైనే ఎక్కువగా ఉంది. అప్పటితో పోలిస్తే నిత్యం అదనంగా రూ.1.22 కోట్ల కంటే ఎక్కువ భారం పడుతోంది. కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకంపై తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు కొంతమేర తగ్గాయి.

ఆర్టీసీ నష్టాల భారం తగ్గించుకోవాలంటే
లీటరు డీజిల్‌పై రూ.10 తగ్గడంతో ఆర్టీసీకి పెద్ద ఊరటగానే మారింది. దీంతో రోజువారీ వినియోగిస్తున్న 6.50 లక్షల లీటర్ల డీజిల్‌పై లెక్కగడితే రూ.65 లక్షలు నేరుగా ఆదా అవుతుంది. ఆర్టీసీ వినియోగిస్తున్న అద్దె బస్సులపై వచ్చే ఆదాను కూడా జోడిస్తే అది రూ.90 లక్షల వరకు చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో చార్జీల పెంపు ఏ రకంగా అవసరంగా మారిందో అధికారులు తాము సమర్పించిన నివేదికల్లో స్పష్టం చేసారు. ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనల్లో.. కి.మీ.కు 15 పైస లు, 20 పైసలు, 25 పైసలు, 30 పైసలు.. ఇలా దేని ప్రకారం ఎంత ఆదాయం పెరుగుతుందనే లెక్కలు అందించారు.
Recommended Video

సీఎం కేసీఆర్ ఆమోదించగానే అమలు
20 పైసలు పెంచితే రూ.625 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 25 పైసలు పెంచితే దాదాపు రూ.750 కోట్లు పెరుగుతుందని, 30 పైసలైతే రూ.900 కోట్లకు పైగా పెరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ చివరగా 2019లో ఛార్జీలను సవరించింది. ఆ సమయంలో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏటా రూ.550 కోట్ల భారం పడుతోంది. చార్జీలు పెంచిన సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.68గా ఉంది. ఇప్పుడది రూ.105కు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి స్థాయిలో వివరాలను సమర్పించిన తరువాత సీఎం దీని పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications