నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ: 20 శాతం తగ్గింపుతో బస్‌పాస్‌లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ).. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌లపై 20 శాతం తగ్గిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలపాటు ఈ పాస్‌లను కొనసాగిస్తామని ఆర్టీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
బస్ పాస్‌ల కోసం దరఖాస్తు చేయాలనుకునే యువతీయువకులు ఆధార్ కార్డ్ జిరాక్స్, కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీ కార్డ్ జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదో ఒకదాన్ని బస్ పాస్ తీసుకునే సమయంలో అందజేయాలని ఆర్టీసీ పేర్కొంది. మూడు నెలలకు గాను ప్రస్తుతం ఆర్డీనరీ బస్ పాస్‌లకు రూ. 3450 వసూలు చేస్తున్నారు. 20 శాతం తగ్గించిన తర్వాత రౌండప్ చేసి రూ. 2800 వసూలు చేయనున్నారు.

ఇక మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం రూ. 3900 వసూలు చేస్తున్నారు. 20 శాతం రాయితీ పోగా రౌండప్ చేసి రూ. 3200 వసూలు చేయనున్నారు. ఈ మేరకు వివరాలను ఆర్టీసీ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ నూతన కాల్ సెంటర్ ను ప్రారంభించినట్లు యాజమాన్యం తెలిపింది. 040-2345-0033, 040-6944-0000 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 24 గంటల సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన నగదు, బస్సుల వివరాలు ఈ నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని టీఎస్ఆర్టీస స్పష్టం చేసింది.
TSRTC is happy to announce 2 new bus passes for the unemployed youth attending training classes for competitive exams in #Telangana with a discount of 20%. #TSRTC wishes you all the very best and bright future ahead @TSRTCHQ @baraju_SuperHit @TV9Telugu @sakshinews#TSRTCNewPass pic.twitter.com/DQUfiRmlpl
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 30, 2022
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతుల చేపట్టిననాటి నుంచి పలు సంస్కరణలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక, సందర్భాన్ని బట్టి ఆర్టీసీ బస్సులలో ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అయితే, ఇటీవల రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications