TSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ.. ఛార్జీల పెంపు..!

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. ఎన్నికల వేళ్ల సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతోంది. ప్రత్యేక బస్సుల అని చెప్పి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు కాకుండా మిగతా బస్సుల్లో కూడా ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎక్స్ ప్రెస్ కు జేబీఎస్ నుంచి కరీంనగర్ కు రూ.230 ఉంటుంది. కానీ ఆర్టీసీ సిబ్బంది మాత్రం రూ.280 వసూలు చేస్తున్నారు.

ఇక స్పెషల్ బస్సుల్లో భారీగా ఛార్జీలు తీసుకుంటున్నారు. సిటీ బస్సులను కరీంనగర్ రూట్ లో వేసి ఒక్కొక్కరికి రూ.410 వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులపై ప్రత్యేక బస్సులని బోర్డు పెట్టడం లేదు. తీర బస్సు ఎక్కిన తర్వాత స్పెషల్ బస్సు అని చెప్పి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులను ఆరా తీయగా.. ప్రత్యేక బస్సులకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు.

TSRTC is charging huge fares in the name of special buses

ప్రత్యేక బస్సులు కాకుండా మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి జేబీఎస్ నుంచి కరీంనగర్ వచ్చే రూట్ తిరుమలగిరి వద్ద బస్సు ఎక్కాడు. అతను టికెట్ తీసుకోగా కండక్టర్ రూ.280 తీసుకున్నారు. ఇదేంటని అడగ్గా.. ఛార్జీలు పెరిగాయని చెప్పారు. ఈ బస్సు సాధారణ ఎక్స్ ప్రెస్ లాగా స్టాపు ఉన్న చోట ఆగింది. ప్రత్యేక బస్సు అయితే నాన్ స్టాప్ ఉంటుందిగా అని ప్రయాణికులు ప్రశ్నించారు.

దీనిపై ఓ వ్యక్తి ఎక్స్ లో టీఎస్ఆర్టీసీని ప్రశ్నించారు. దీనిపై టీఎస్ ఆర్టీసీ వారు కూడా స్పందించారు. ఏది ఏకమైనప్పటికీ ఎన్నికల కోసం వెళ్లే వారు భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అటు ఏపీ వెళ్లే ఓటర్లు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+