ఆర్టీసీ బస్సులో ఎండీ సజ్జనార్, కుటుంబసభ్యుల సందడి, ఆటపాటలు(వీడియో)
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలను, ప్రణాళికలను అమలు చేస్తున్నారు వీసీ సజ్జనార్. ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్న సజ్జనార్.. తాజాగా తన కుటుంబసభ్యులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు.
తెలంగాణ ఆర్టీసీని మరింత చేరువ చేసేందుకు అనేక వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగుతున్నారు సజ్జనార్. తాజాగా, సజ్జనార్ తన కుటుంబసబ్యులు, బంధుమిత్రులతో సపరివార సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వివరించేలా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సజ్జనార్, తన కుటుంబసభ్యులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సాయితేజ అనే సామాజిక కార్యకర్త ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీన్ని సజ్జనార్ రీట్వీట్ చేశారు. దీంతో ఆర్టీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సజ్జనార్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది ఇలావుండగా, ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా, స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(నవంబర్ 30న) బస్ డిపోల్లో రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. పౌరులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా రక్తదానానికి ముందుకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. తలసేమీయా బాధితుల కోసం మంగళవారం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
.@tsrtcmdoffice VC Sajjanar కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియు సపరివార సమేతంగా బస్సులో ప్రయాణం చేసి @TSRTCHQ బస్సులో ప్రయాణం సురక్షితం,సుఖమయం మరియు శుభప్రదం అని ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్న వైనం.
— Abhinay Deshpande (@iAbhinayD) November 29, 2021
It's Family Time Huhuhu, hooch! #Hyderabad #IchooseTSRTC pic.twitter.com/wZYigHFRZC
ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ శిబిరాల్లో రక్తదానం చేసిన వారికి నవంబర్ 30న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవకాశం కల్పిస్తున్నట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని తలసీమియా బాధితుల కోసం ఆర్టీసీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications