గ్రామాలు, పట్టణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్:కొత్తగా టీ9 టిక్కెట్, షరతులు వర్తిస్తాయ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) రాష్ట్ర పట్టణ, గ్రామీణ ప్రజలకు శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టీ9 పేరుతో కొత్తగా టికెట్ తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో 'టీ-9 టిక్కెట్' పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ఆవిష్కరించారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సిటీలో ఈ టిక్కెట్లకు మంచి స్పందన రావడంతో.. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం మొదటిసారిగా టీ-9 టిక్కెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.

గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ(టీ-9 టిక్కెట్) సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఇతర సందేహాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లను 040-69440000, 040-23450033లను సంప్రదించాలని ఆయన సూచించారు.
'టీ 9 టికెట్'కు అర్హులు వీరే: ప్రయోజనాలు, నిబంధనలు
పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, 60 ఏళ్లుపైబడిన వృద్ధులు మాత్రమే టి 9 టిక్కెట్ వినియోగించుకోవడానికి అర్హులు.
టీ-9 టిక్కెట్ ధర రూ.100గా ఆర్టీసీ నిర్ణయించింది.
గ్రామాల్లోని పల్లె వెలుగు బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
60 ఏళ్లు పైబడిన వృద్ధులు వయస్సు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్‌లకు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
ఈ టిక్కెట్టు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
టీ9 టికెట్‌తో 60 కిలోమీటర్ల లోపు ప్రయాణించవల్సి ఉంటుంది. రావడానికి, పోవడానికి ఒకసారి మాత్రమే వినియోగించాలి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులో టీ9 టికెట్లు చెల్లుబాటు అవుతాయి.
ఈ టికెట్ ద్వారా ఒక్కొ ప్రయానికుడిపై రూ.20 నుంచి రూ.40 వరకు ఆర్థిక బారం తగ్గుతుందని ఆర్టీసీ వివరించింది.
కాగా, ప్రయాణికులకు చేరువయ్యేందుకు తీసుకొచ్చిన టీ24 టికెట్ ధరలను టీఎస్ఆర్టీసీ ఇటీవలపెంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో తక్కువ ధరలో 24 గంటలపాటు ప్రయాణించడానికి టీ-24 టికెట్ ఎంతో ఉపయోగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ టీ-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో ప్రయాణించే సామాన్యలకు ఆర్టీసీ నిర్ణయం కొంత షాకింగ్ అనే చెప్పాలి. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ. 90 నుంచి రూ. 100కి పెంచేసింది. ఇక సీనియర్ సిటిజన్ల(పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా రూ. 90కి పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేసింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications