తెలంగాణా సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తెలంగాణా రాష్ట్రం నుండి వచ్చే సిఫార్సు లేఖల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ ఈ మేరకు కీలక విషయం వెల్లడించింది. మార్చి 24వ తేదీ నుండి తెలంగాణా సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు చేస్తున్నట్టు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణా నుండి వచ్చిన సిఫార్సు లేఖలను పట్టించుకోలేదు.
తెలంగాణా ప్రజాప్రతినిధుల లేఖలు స్వీకరించనున్న టీటీడీ
తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు ప్రత్యేక చొరవతో తెలంగాణా ప్రజాప్రతినిధుల లేఖలు స్వీకరించే విధానం అమలు చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణా సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బుధ,గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయింపు చేస్తున్నట్టు వెల్లడించారు.

టీటీడీ కీలక నిర్ణయం
ప్రజాప్రతినిధి ఒకరికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే 6 మందికి మించకుండా టీటీడీ దర్శనం కేటాయించనుంది. ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడవని పేర్కొంది. దానికి బదులుగా శనివారం నాడు ఆదివారం దర్శనం కొరకు లేఖలు స్వీకరించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
టీటీడీ నిర్ణయంపై మంత్రి కొండా సురేఖ
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను వారంలో రెండు రోజులు మాత్రమే అనుమతించేలా నిర్ణయం తీసుకుంది. ఇక టిటిడి తీసుకున్న తాజా నిర్ణయం పైన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. నేడు ఆమె మాట్లాడుతూ టిటిడి బోర్డుతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తమ విజ్ఞప్తితో ప్రభుత్వం వెంటనే స్పందించిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications