రేవంత్ ఎఫెక్ట్, టీడీపీలో 'వెల్‌కం': ఆయన టీఆర్ఎస్‌లోకి, అనుచరుడు కాంగ్రెస్‌లోకి

Posted By:
Subscribe to Oneindia Telugu
  రేవంత్ రెడ్డి పరిణామంతో ఆయన TRS లోకి, అనుచరుడు కాంగ్రెస్‌లోకి | Oneindia Telugu

  హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం కారణంగా 2014 ఎన్నికల్లో టీడీపీ ఆటుపోట్లకు గురయింది. ఆ తర్వాత ఓటుకు నోటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిణామంతో మరింత కుదేలయిందని అంటున్నారు. రేవంత్ కారణంగానే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇలా ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

  ఢిల్లీకి చేరిన రేవంత్, అనుచరుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు, హుటాహుటిన సీతక్క

  టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న రేవంత్ బాటలో పలువురు నేతలు, క్రియాశీలక కార్యకర్తలు నడుస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి, రాజారాం యాదవ్, సీతక్క, సుభాష్ రెడ్డి తదితరులు ఆయన వెంట వెళ్తున్నారు.

  ఇదీ రేవంత్!: ఏబీవీపీ నేత కాంగ్రెస్‌లోకి, బీజేపీకి దిమ్మతిరిగే సంకేతాలు, టీఆర్ఎస్ నుంచీ

  టీడీపీకి కష్టకాలంలోను దిక్కుగా నిలుస్తూ వచ్చిన మండవ వెంకటేశ్వర రావు, అరికెల నర్సారెడ్డి తదితరులు కూడా పార్టీ మారే యోనలో ఉన్నారు. మండవ టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

   'వెల్‌కం' దిశగా

  'వెల్‌కం' దిశగా

  మరోవైపు, అరికెల నర్సారెడ్డి స్థానిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. 2014 ఎన్నికల్లో మండవ పోటీ చేయలేదు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా కనిపించలేదు. కేసీఆర్‌తో టీడీపీలో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఓ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు వెళ్తుంటే, మరో సామాజిక వర్గం నేతలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

   మండవకు గతంలోనే ఆహ్వానం కానీ

  మండవకు గతంలోనే ఆహ్వానం కానీ

  మండవ వెంకటేశ్వర రావును టీఆర్ఎస్‌లో చేరాలని కేసీఆర్, టీఆర్ఎస్ వర్గాలు గతంలో చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. ఎన్నికలకు ముందు ఏదో నిర్ణయం తీసుకోవచ్చునని ఇప్పటి దాకా వేచి చూశారు.

   రేవంత్ ఎపిసోడ్ కారణంగా టీడీపీకి గుడ్ బై

  రేవంత్ ఎపిసోడ్ కారణంగా టీడీపీకి గుడ్ బై

  కానీ, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కారణంగా ఆయన టీడీపీని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన అనుచరులు కూడా మండవ పైన టీఆర్ఎస్‌లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

   అరికెలకు రాని హామీ

  అరికెలకు రాని హామీ

  మండవ టీఆర్ఎస్‌లో చేరితే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టు కలిగిన ఆయనకు అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం కల్పించడం ఖాయమని భావిస్తున్నారు. మండవ ప్రధాన అనుచరుడిగా ఎదిగిన అరికెల నర్సారెడ్డి తనకు అర్బన్ టిక్కెట్ వచ్చేలా చూడాలని చెప్పారని, దానిపై హామీ రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని తెలుస్తోంది. మండవ కూడా హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

   పార్టీలో ఆందోళన

  పార్టీలో ఆందోళన

  వీరిద్దరు టీడీపీని వీడితే నిజామాబాద్‌లో ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోయినట్లేనని అంటున్నారు. వలసలు, ఎదురుదెబ్బలతో ఇప్పటికే టీడీపీ ఢీలాపడింది. తాజాగా రేవంత్ కారణంగా మరింత నష్టం జరుగుతోందంటున్నారు. 2019 ఎన్నికల నాటికి టీడీపీ నాయకులను, కేడర్‌ను వెతుక్కునే పరిస్థితులు ఎదురవుతాయేమోనని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party’s former working president and legislator Revanth Reddy on will join the Congress party, a fortnight after rumours began that he had met Congress leaders to negotiate his entry. He will leave for New Delhi on Tuesday to meet All India Congress Committee (AICC) vice president Rahul Gandhi, a statement from Reddy’s office said.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి