క్షమించండి: నా తండ్రి కబ్జా చేసిన స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తా: ముత్తిరెడ్డి కూతురు భవానీ
సిద్దిపేట: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూ వివాదం మరో మలుపు తీసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింద స్థలాన్ని తన తండ్రి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఆరోపించారు.
ఆదివారం ఉదయాన్నే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.. తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటికి అప్పగిస్తానన్నారు ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.

గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు తుల్జా భవానీ. గ్రామ స్థలాన్ని తన తండ్రి.. తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని ఆమె ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఆ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ ఏ గొడవలు రాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తానని తుల్జా భవనా స్పష్టం చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మా నాన్న భూమి కబ్జా చేసి తప్పు చేశాడు,తిరిగి ఇచ్చేస్తున్న: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు భవాని..!#MuthireddyYadagiriReddy #TuljhaBhavaniReddy #LandGrabCase #Telangana #Oneindiatelugu pic.twitter.com/fsfOMuGUPy
— oneindiatelugu (@oneindiatelugu) June 25, 2023
'మా నాన్నకు 70 ఏళ్ళు వచ్చాయి.. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉంది.. అలాంటి వ్యక్తి ఇలాంటి పని చేయకూడదంటూ పేర్కొన్నారు. చెరువు మత్తడి భూమిని నాపేరు మీద పట్టా చేయించారు. తప్పు జరిగింది..క్షమించండి .. అంటూ కోరారు. తన పేరు మీద ఉన్న భూమిని మళ్ళీ చేర్యాల మున్సిపాలిటికి రాసిస్తున్నాను.. మళ్ళీ ఎటువంటి గొడవలు కాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తా' అని తెలిపారు. కాగా, ఇటీవల జనగామలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఈ విషయంపై భవానీ అందరిముందే బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications