SLBC టన్నెల్ ప్రమాదంలో షాకింగ్ విషయాలను వెల్లడించిన సింగరేణి సీఎండీ బలరాం!
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి చోటుచేసుకుంది. టన్నెల్ లో చిక్కుకున్న వారిని గుర్తించటం కోసం రకరకాలుగా గాలింపు చేపట్టిన రెస్క్యూ బృందాలు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లుగా గుర్తించారు.
మెత్తని భాగాలను గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా గుర్తింపు
బోరింగ్ మిషన్ ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో ఐదు మెత్తని భాగాలను వారు గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్టుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు. అయితే ఆ మెత్తని భాగాలు ఉన్నచోట తవ్వకాలను జరపనున్నారు. అవి మానవదేహాలా కాదా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో గల్లంతైనవారు అందరూ మృతి చెందినట్లు మరికాసేపట్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

మరో రెండు రోజులు పడుతుందన్న సింగరేణి సీఎండీ
సింగరేణి క్యాలరీస్ సీఎండి బలరాం ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో చిక్కుకున్న వారికి సంబంధించి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందన్నారు. ఎన్జిఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించారు. కానీ కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరామని పేర్కొన్నారు.
అవి వచ్చాకే ఆచూకీ లభించని వారిని గుర్తించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
రెండు ముక్కలుగా టన్నెల్ బోరింగ్ మెషిన్
అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది అన్నారు . టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు ముక్కలైంది. 13.6 కిలోమీటర్ల వద్ద ఒక ముక్క, 13.9 కిలోమీటర్ల తర్వాత మరో ముక్క పడ్డట్టు గుర్తించామన్నారు. ఈ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని గుర్తించడానికి ఎన్డిఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, రాట్ హోల్ మైనర్స్, బీఆర్వో, నేవీ ,ఆర్మీ, సింగరేణి, హైడ్రా, మార్కోస్ ఇలా ఎన్నో బృందాలు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications