రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి: కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య
వరంగల్ : మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు.. నర్సంపేట నుంచి గూడూరు వైపునకు వెళ్తున్న ఆటో బుధరావుపేట వద్ద ఎదరురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు,పోలీసుల కథనం ప్రకారం.మంగళవారం రాత్రి మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ,నర్సంపేట నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో గూడూరు మండలం భూపతిపేట శివారు కోమటిపెల్లితండకు చెందినఆటో డ్రైవర్ బోడ రాజేందర్(21) అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇతనితో పాటు ఆటోలో ఉన్న ఖానాపురం మండలం వేపచెట్టుతండాకు చెందిన జాటోత్ రాజు(20)ని,గుగులోత్ రమణను స్థానికులు అటుగా వస్తున్న 108 లో నర్సంపేటకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు.ఇదే తండాకు చెందిన రమణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఆటో డ్రైవర్ రాజేందర్ ఆటో నడుపుతూ డెక్కు పెట్టే క్రమంలో నిర్భయంగా నడపడంతోనే ఆటో పల్టీలు కొట్టి బస్సును ఢీకొట్టింది. సంఘటనా స్థలానికి సీఐ కిషన్, ఎస్సై గురుస్వామి, ఏఎస్సై రామారావు చేరుకొని రాకపోకలను కొనసాగించారు. వివరాలను సేకరించి విచారణ చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండంలోని నాచినపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. నర్సంపేట మండం ముత్తోజిపేటకు చెందిన కాకి రవి (40)కి మహ్మదాపురం గ్రామానికి చెందిన నర్సమ్మతో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం రవి అత్తగిరింటి గ్రామం మహ్మదాపురంలో కొన్నేళ్లున్నాడు. అనంతరం ఐదేళ్ల క్రితం నాచినపల్లికి వచ్చి రైతు పుచ్చకాయం శ్రీనివాసరెడ్డి వద్ద జీతం ఉన్నాడు. రెండేళ్ల వరకు జీతం చేసిన రవి తిరిగి అత్తగారింటికి వెళ్లాడు.
అప్పుడప్పుడు తన పాత యజమాని శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి రెండు మూడు రోజు ఉండి వెళ్లేవాడు. అయితే రవి కొన్ని సంవత్సరాుగా తాగుడుకు బానిసగా మారాడని బాధితుడి భార్య నర్సమ్మ తెలిపింది. ఈ క్రమంలో తన పాత యజమాని శ్రీనివాసరెడ్డి ఇంటికి సోమవారం వచ్చాడు. అయితే అదే రోజు రాత్రి గడ్డివాము వద్ద మృతి చెంది ఉన్నాడు.
రవి మృతి చెందిన విషయం తెలియడంతో భార్య నర్సమ్మ వచ్చి చూసి బోరున విపించింది. తన భర్త చావుపై తనకు అనుమానాలు ఉన్నాయని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డి తెలిపారు.
విద్యాదాఘాతంలో యువ రైతు మృతి
ప్రమాదవశాత్తు జరిగిన విద్యుదాఘాతంతో యువరైతు మృతిచెందిన సంఘటన మండంలోని మైసంపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పిట్ట సతీష్ (20)కి రెండు ఎకరా వ్యవసాయ భూమి ఉంది. దానిలో పత్తి, మిరపపంట వేశాడు. మిరప పంటకు నీరు పెట్టడానికి మోటారుకు కరెంట్ సరిగా రాకపోవడంతో వెదురు కర్రతో వైర్లను కదిలించాడు.
అయితే తీగ ఊడి వచ్చి మీద పడడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య చంద్రకళ, తల్లి సాంబక్ష్మీ, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి పిట్ట రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు.
కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య
జనగామ జిల్లా బచ్చన్నపేట మండ కేంద్రానికి చెందిన దిష్ కేబుల్ ఆపరేటర్ నీ వెంకటేశం(49) మంగళవారం ఇంట్లో ఆత్మహత్యకు ప్పాడ్డాడు. గ్రామస్తు తెలిపిన వివరా ప్రకారం... ఇంట్లో మధ్యాహ్నం మద్యంలో పైపు అతికించే సాల్వెంట్ కుపుకొని ఆత్మహత్యకు ప్పాడగా, ఆస్యంగా గమనించిన స్థానికు అసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. వెంకటేశం మృతితో మండ ప్రజు పువురు డిష్ కేబుల్ ఆపరేటర్లు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications