పంజాగుట్టలో డీసీఎం బోల్తా, వ్యక్తి కాళ్లు నుజ్జునుజ్జు (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: డీసీఎం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన సంఘటన హైదరాబాదులోని పంజాగుట్టలో శనివారం నాడు చోటు చేసుకుంది.

డీసీఎం బోల్తా పడిన ఘటనలో బైక్ పైన వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ డీసీఎం వారు ప్రయాణిస్తున్న బైక్‌కు తగిలింది. దీంతో గాయాలయ్యాయి.

 పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్టలో డెనిమ్ షోరూం ఎదురుగా.. కోదాడ నుంచి రవి తేజ డీసీఎం వ్యాన్లో పేపర్ బండిళ్లను బాలానగర్ తీసుకు వెళ్తున్నాడు.

పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట వద్ద ప్రమాదం

ఈ ఘటనలో బైక్ పైన ప్రయాణిస్తున్న ఎస్సార్ నగర్‌కు చెందిన పవన్ కుమార్, ప్రసాద్‌లకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పవన్ కుడికాలు నుజ్జునుజ్జు అయింది.

పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట వద్ద ప్రమాదం

డీసీఎం రహదారికి అడ్డంగా పడి ఉండటంతో అందులోని పేపర్ బండిళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఖైరతాబాద్ -పంజాగుట్ట రహదారిలో ట్రాఫిక్ జాం అయింది.

 పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాన్ని, పేపర్ బండిళ్లను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

 పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట వద్ద ప్రమాదం

పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోదాడ నుంచి శ్రీప్రసన్న పేపర్‌ ప్రొడక్ట్స్‌కు చెందిన పేపరు బండిల్‌ లోడు డీసీఎం వాహనంతో (టీఎస్‌ 05 యూఎ 6847లో) నగరానికి వస్తుంది. వాహన చోదకుడు బి.రవితేజ (35) దారి మధ్యలో పూటుగా మద్యం తాగాడు. డ్రైవర్‌ రవితేజ 102 ఎంజిలు తాగినట్లుగా తేలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two injured in DCM and bike accident at Panjagutta on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి