Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో కలకలం: దుర్గామాత, జీసస్, మదర్ మేరీ విగ్రహాల ధ్వంసం, మహిళల అరెస్ట్

హైదరాబాద్: దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న సమయంలో నగరంలో విగ్రహాల ధ్వంసం ఘటన కలకలం రేపింది. దుర్గా మాత విగ్రహం, మదర్ మేరీ, జీసస్ విగ్రహాలను ధ్వంసం చేసిన ఇద్దరు ముస్లిం మహిళలను సెంట్రల్ జోన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

విగ్రహాలను ధ్వంసం చేసిన ఇద్దరు మహిళలను పట్టుకున్న స్థానికులు సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఖైరతాబాద్ చింతలబస్తిలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలోని విగ్రహాన్ని ఆ మహిళలు పాక్షికంగా ధ్వంసం చేశారు.

Two Muslim Women Held For Vandalising Goddess Durga Idol, Jesus, Mother Mary Statues in Hyderabad

స్పానర్లు పట్టుకు తిరుగుతున్న ఓ మహిళ.. వారిని అడ్డుకున్న స్థానికుడిపై దాడి చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ చంద్ర తెలిపారు.

అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం పట్ల భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన నిందితులపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, విగ్రహాలు ధ్వంసం చేసిన ఓ మహిళకు మతిస్థిమితం సరిగా లేదని కొందరు చెబుతున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి, మెంటల్ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+