బంగారం స్మగ్లింగ్ లో ఆ కిలాడీల తెలివి చూస్తే మీరే షాకవుతారు!!
బంగారం స్మగ్లింగ్ .. ఇప్పుడు దేశంలో ఇదో ప్రధాన సమస్యగా మారింది. నిత్యం ఎక్కడో ఒక చోట బంగారం స్మగ్లింగ్ గ్యాంగులు రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే ఎవరికీ పట్టుబడకుండా రకరకాల కొత్త మార్గాలలో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. నిత్యం దేశ వ్యాప్తంగా కిలోల మేర బంగారం అక్రమ రవాణా జరుగుతుంది . ఇక ఎయిర్ పోర్ట్ లలో అయితే బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకోవటం నిత్య కృత్యంగా మారింది. ఇక తాజాగా ఇద్దరు మహిళలు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఇద్దరు మహిళల నుండి 3.05 కిలోల బంగారం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులను పంతంగి టోల్ ప్లాజా వద్ద స్పెషల్ ఆపరేషన్స్ టీం అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 3.05 కిలోల బంగారం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఇద్దరు మహిళల వద్ద భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.

షార్జా నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న మహిళలు
బంగారాన్ని పేస్టు రూపంలో లగేజ్ బ్యాగ్ లో తరలిస్తుండగా, పట్టుకున్న అధికారులు ఇద్దరు మహిళా ప్రయాణికులతో పాటు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిని డిఆర్ఐ అధికారులకు అప్పగించారు. అయితే ఈ కిలాడీ లేడీ లు షార్జా నుండి భారత్ కు బంగారాన్ని తరలించటానికి రంగంలోకి దిగారు. షార్జా నుండి విజయవాడ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మహిళలు అక్కడ కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పి అక్కడ నుండి తప్పించుకుని బంగారాన్ని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

పేస్ట్ రూపంలో బంగారం .. కేసు నమోదు చేసిన డీఆర్ఐ
దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీం అధికారులు లగేజ్ బ్యాగులు పరిశీలించగా పేస్ట్ రూపంలో బంగారం కనిపించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కారుని, బంగారాన్ని సీజ్ చేశారు డీఆర్ఐ బృందం. దీనిపై ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ మహిళలు ఎవరికి ఈ బంగారాన్ని ఇవ్వటానికి వెళ్తున్నారు. వీరి వెనుక ఉంది ఎవరు అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications