ప్రొఫెసర్ హరగోపాల్ సహా వీరిపై దేశద్రోహం కేసు ఎత్తివేత: ములుగు ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తోపాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలతిపారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు.

ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి సురేశ్‌పై కేసు ఎత్తివేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా-యూఏపీఏ) కింద కేసు నమోదైంది. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఏడాది క్రితం పెట్టిన కేసు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

professor Haragopal

కాగా, 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్‌లో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద హరగోపాల్‌పై కేసు నమోదు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ తో పాటు 152 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై యూఏపీఏ కింద కేసు పెట్టడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

హరగోపాల్‌పై దేశద్రోహం కేసు పెట్టడంపై కాంగ్రెస్ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ కేసును ఆయనపై తొలగించాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల నేతలు కూడా హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై మండిపడ్డారు. హరగోపాల్ పై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గమని అంటున్నారు.

కాగా, 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద హరగోపాల్‌ పై కేసు నమోదు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ తో పాటు 152 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్‌ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి.

అయితే, హరగోపాల్‌ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్‌ ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ క్రమంలో కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే హరగోపాల్‌ తదితరులపై ఉపా కేసులు ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+