Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హోంవర్క్ చేయలేదని యూకేజీ విద్యార్థి తలపై పలకతో కొట్టిన టీచర్, చిన్నారి మృతి

హైదరాబాద్:నగరంలోని రామాంతపూర్ వివేక్ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వివేక్‌నగర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న విద్యార్థి హేమంత్ టీచర్ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. శనివారంనాడు హోంవర్క్ చేయలేదని స్కూల్ టీచర్ చిన్నారి తలపై పలకతో కొట్టడంతో అతడు ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ మేరకు చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తూ పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విద్యార్థి మృతదేహంతో ధర్నా చేపట్టారు. పోలీసులు, పాఠశాల యాజమాన్యం స్పందించడంతో ఆందోళన విరమించారు. చిన్నారి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వనపర్తికి తరలించారు.

UKG student died after teacher beat him for not doing homework at school in Ramanthapur, Hyderabad

అయితే, గత వారం రోజులుగా హేమంత్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ఉప్పల్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే టీచర్ కొట్టడంతో మరింత అస్వస్థతకు గురైన చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది.

సూపర్ మార్కెట్‌లో ఫ్రిడ్జ్‌ని ముట్టుకోవడంతో విద్యుత్ షాక్, చిన్నారి మృతి

తండ్రితో సరదాగా సూపర్ మార్కెట్ వెళ్లిన ఓ నాలుగేళ్ల చిన్నారి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సూపర్ మార్కెట్లోని ఓ ఫ్రిడ్జిని ముట్టుకోగానే విద్యుత్ షాక్ కొట్టడంతో ఆ చిన్నారి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట పట్టణంలోని ఎన్ సూపర్ మార్కెట్లో చోటు చరేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండల కేంద్రానికి చెందిన రాజశేఖర్, సంయుక్తలకు రిషిత రెండో సంతానం. బంధువుల ఇంటికి ఓ పూజా కార్యక్రమానికి వెళ్లారు. పూజ సామాగ్రి కొనేందుకు తండ్రి, కుమార్తె కలిసి సూపర్ మార్కెట్ కు వెళ్లారు. రిషితకు ఐస్ క్రీమ్ తీసుకునేందుకు రాజశేఖర్ ఫ్రిజ్ వద్దకు వెళ్లారు.

అప్పుడే రిషిత కూడా అక్కడేవున్న మరో ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి డోర్ ముట్టుకోవడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన వెంటనే తండ్రి.. తన కుమార్తెను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రిషిత తల్లిదండ్రులు, బంధువులు పాప మృతికి కారణమైన సూపర్ మార్కెట్ ఎదుట మృతదేహంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపర్ మార్కెట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. రిషిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చిన్నారి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను విరమించారు. అయితే, ఫ్రిడ్జ్ పట్టుకుంటే విద్యుత్ షాక్ రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+